నాన్నకు ప్రేమతో చిత్రంతో తొలిసారి 50 కోట్ల రూపాయల వసూళ్ల క్లబ్ లోకి ఎంటర్ అవడంతో.. జూనియర్ ఎన్టీఆర్ ఆ సక్సెస్ ను ఫుల్లుగానే ఎంజాయ్ చేస్తున్నాడు. తరువాతి ప్రాజెక్టుకు సంసిద్ధమయిపోయాడు. ఈ నెల 22నుంచి కొరటాల శివతో చేయనున్న జనతా గ్యారేజ్ షూటింగ్ మొదలుపెట్టనున్నాడు యంగ్ టైగర్.
జనతా గ్యారేజ్ కోసం ఇప్పటికే సారధి స్టూడియోస్ లో భారీ సెట్ నిర్మాణం దాదాపు పూర్తయింది. ఇందుకోసం దాదాపు 3 కోట్ల రూపాయలు వెచ్చించి, ఎన్టీఆర్ పనిచేసే గ్యారేజ్ ను.. దాని పరిసరాలను సెట్టింగ్ వేశారు. ఈ సెట్ లుక్ అద్భుతంగా వచ్చిందని చూసినవాళ్లు చెబుతున్నారు. ఈ గ్యారేజ్ లోకి ఇప్పుడు పాత కార్లు తెచ్చే పనిలో ఉన్నారట. ఓ 15-20 పాత కార్లను గ్యారేజ్ లో చేర్చే పనిలో పడ్డారు యూనిట్. ఇప్పటికే విడివిడిగా చెరో రెండు హిట్స్ కొట్టిన ఎన్టీఆర్ - కొరటాల శివలకు... జనతా గ్యారేజ్ తో కంబైన్డ్ గా హ్యాట్రిక్ పూర్తి చేసేందుకు సిద్ధమైపోతున్నారు.
గత రెండు సినిమాల్లో రెండు డిఫరెంట్ లుక్స్ చూపించిన ఎన్టీఆర్.. ఈ మూవీ కోసం తన ఒరిజినల్ గెటప్ నే ఎంచుకున్నాడని తెలుస్తోంది. సమంత - నిత్యామీనన్ లు హీరోయిన్ లు గా నటిస్తున్న జనతా గ్యారేజ్ లో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. కాంబినేషన్స్ సూపర్బ్ గా ఉండడంతో.. ఇప్పటికే ఈ మూవీకి అన్ని ఏరియాల నుంచి మంచి బిజినెస్ జరుగుతోంది.