మునుపెన్నడు కనిపించని బ్యాక్ డ్రాప్ లో ఎన్టీఆర్‌

Update: 2022-04-24 02:30 GMT
యంగ్‌ టైగర్ ఎన్టీఆర్‌ నుండి నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చిన ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్‌ అయ్యి నందమూరి అభిమానులకు ఇన్నాళ్లే కరువును తీర్చింది. ఎన్టీఆర్‌ పోషించిన కొమురం భీమ్‌ పాత్రకు మంచి పేరు దక్కడంతో పాటు ఆర్ ఆర్‌ ఆర్ సినిమాకు వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు నమోదు అవ్వడంతో ఎన్టీఆర్‌ స్థాయి పాన్ ఇండియా రేంజ్ కు వెళ్లిందంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఎన్టీఆర్‌ అభిమానులు గత ఏడాది కాలంగా దర్శకుడు కొరటాల శివ వైపు ఆసక్తిగా చూస్తున్నారు. ఎన్టీఆర్‌ తో ఇప్పటికే జనతా గ్యారేజ్ అనే సినిమాను తెరకెక్కించి మంచి విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు కొరటాల శివ తదుపరి సినిమాగా ఎలాంటి సినిమాను చేస్తాడా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఏడాది కాలంగా అదుగో ఇదుగో అంటూ వాయిదాలు పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు జూన్ నెలలో పట్టాలెక్కబోతున్నట్లుగా ప్రకటన వచ్చింది.

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన మెగాస్టార్‌ చిరంజీవి 'ఆచార్య' చిత్రం ఈ వారంలో విడుదలకు సిద్దం అవుతుంది. ఆ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా దర్శకుడు కొరటాల శివ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హీరోగా ఎన్టీఆర్‌ ఇప్పటి వరకు కనిపించని విభిన్నమైన పాత్రలో ఆయన్ను చూపించబోతున్నట్లుగా కొరటాల శివ వ్యాఖ్యలు చేసి అంచనాలు పెంచాడు.

తాజాగా మరో ఇంటర్వ్యూలో కొరటాల శివ మాట్లాడుతూ ఎన్టీఆర్‌ 30 సినిమా కథకు సంబంధించిన నేపథ్యం గురించి వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటి వరకు ఇండియన్ సినీ స్క్రీన్‌ పై చూడని ఒక విభిన్నమైన బ్యాక్ డ్రాప్‌ ను.. నేపథ్యంను చూపించబోతున్నట్లుగా చెప్పుకొచ్చాడు.

ప్రతి ఒక్కరికి కూడా నచ్చే విధంగా మెచ్చే విధంగా సినిమా కథ ఉంటుంది.. ఆ కథ నేపథ్యం ఉంటుంది అన్నట్లుగా కొరటాల శివ మరోసారి ఎన్టీఆర్‌ 30 పై అంచనాలు భారీగా పెంచాడు.

వీరిద్దరి కాంబోలో గతంలో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా కూడా చాలా విభిన్నంగా ఉంది. అందులో ఎన్టీఆర్‌ పాత్రకు చాలా మంది సాదారణ ప్రేక్షకులు మరియు ఫ్యామిలీ ప్రేక్షకులు ఫిఆ అయ్యారు అనడంలో సందేహం లేదు. హీరోగా ఎన్టీఆర్‌ స్టామినా అప్పటికి ఇప్పటికి మరింత పెరిగింది. కనుక అందుకు తగ్గట్లుగానే కొరటాల శివ ఎన్టీఆర్‌30 సినిమా కోసం కథను రెడీ చేసినట్లుగా తెలుస్తోంది.
Tags:    

Similar News