అరవింద అక్కడ వెనకబడిందే..!

Update: 2019-01-24 12:19 GMT
యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాస్ట్ సినిమా 'అరవింద సమేత' పోయినేడాది దసరా సీజన్లో విడుదలయింది.  బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధించిన ఈ సినిమాను ఈమధ్యే బుల్లితెరలో ప్రసారం చేశారు.  టీవీ లో టెలికాస్ట్ అంటేనే అందరి దృష్టి టీఆర్పీల మీదే ఉంటుంది కదా.   జీ తెలుగు ఛానల్లో టెలికాస్ట్ చేసిన 'అరవింద సమేత' ప్రిమియర్ కు 13.70 టీఆర్పీ రేటింగ్స్ సాధించింది.

ఈ టీఆర్పీ రేటింగ్స్ డీసెంట్ అయినప్పటికీ ఇతర స్టార్ హీరోల సినిమాలతో పోలిస్తే మాత్రం తక్కువే. లాస్ట్ ఇయర్ టీవీ ప్రీమియర్స్ లో 'గీత గోవిందం' 20.51 రేటింగ్స్ లో టాప్ లో ఉండగా.. 'రంగస్థలం' 19.50 రేటింగ్స్ లో రెండో స్థానంలో నిలిచింది.  'భరత్ అనే నేను' 14.60 రేటింగ్స్ తో మూడో స్థానం సాధించగా 'అరవింద సమేత' 13.70 రేటింగ్స్ తో నాలుగో స్థానంలో నిలిచింది.  2018 లో టీవీలో టెలికాస్ట్ చేసిన ఇతర స్టార్ హీరోల సినిమాలలో 'నా పేరు సూర్య' 12.15 రేటింగ్స్ సాధించింది. ఇదిలా ఉంటే 'అజ్ఞాతవాసి' మాత్రం అతి తక్కువగా 6.11 రేటింగ్ మాత్రమే సాధించింది.

పూజా హెగ్డే.. ఈషా రెబ్బా హీరోయిన్లుగా నటించిన 'అరవింద సమేత' సినిమాకు థమన్ సంగీతం అందించాడు.  'అజ్ఞాతవాసి' డిజాస్టర్ తో నిరాశపడిన దర్శకుడు త్రివిక్రమ్ కు 'అరవింద సమేత' విజయం పెద్ద రిలీజ్ ఇచ్చింది.
Tags:    

Similar News