బిగ్ బాస్ సీజన్ 2లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. 68వ రోజు ఆరంభం ఎప్పటిలానే స్టార్ట్ అయినా.. టాస్క్ లో భాగంగా యాక్టివిటీ చేస్తున్న క్రమంలో కంటెస్టెంట్ నూతన్ నాయుడు గాయపడటం.. అతగాడి గాయం తీవ్రమైనదన్న విషయాన్ని గుర్తించటంతో ఆయన హౌస్ నుంచి బయటకు వెళ్లిపోవాల్సిన పరిస్థితి చోటు చేసుకుంది. ఊహించని ఈ పరిణామం ఇంటి సభ్యుల్ని షాక్ కు గురి చేసింది. ఇక.. కౌశల్ అయితే గాయంతో నూతన్ హౌస్ నుంచి వెళ్లిపోవాల్సి వచ్చిందన్న విషయం తెలిసిన వెంటనే కుప్పకూలిపోయాడు. ఇంటి సభ్యులు సైతం విస్మయానికి గురి కావటమే కాదు.. తీవ్ర వేదనకు లోనయ్యారు. ఇదిలా ఉంటే.. తీవ్ర గాయమైన నూతన్ ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఇంతకీ హౌస్ లో నూతన్ నాయుడు గాయానికి గురయ్యే పరిస్థితి ఎందుకు వచ్చిందన్నది చూస్తే..
68వ రోజును ఇంటి సభ్యులు ఉత్తేజంగా షురూ చేశారు. ఎప్పటిలానే ఉదయాన్నే వినిపించే పాటకు నూతన్ చక్కగా డ్యాన్స్ వేశాడు కూడా. మధ్యాహ్న వేళ ఇంట్లో కెప్టెన్ టాస్క్ మొదలైంది.
కెప్టెన్సీ షిప్ కోసం కౌశల్.. రోల్ రైడా పోటీ పడ్డారు. ఇరువరి మధ్య టాస్క్ మొదలైంది. పడగొట్టు.. నిలబెట్టు అన్న పేరుతో మొదలైన టాస్క్ లో కొన్ని బ్లాకుల్నిఇస్తారు. వాటిని కెప్టెన్సీ షిప్ కోసం పోటీ పడే వారు నిర్మిస్తూ ఉంటే మరికొందరు సభ్యులు వాటిని బంతులతో పడగొట్టే ప్రయత్నం చేస్తారు. ఆ బంతుల్ని కాచుకుంటూ పిరమిడ్ ను నిర్మించాల్సి ఉంటుంది.
ఇదిలా ఉంటే.. రోల్ రైడా పిరమిడ్ ను పడగొట్టే ప్రయత్నంలో బంతిని బలంగా విసిరే క్రమంలో నూతన్ నాయుడు గాయానికి గురయ్యారు. పైకి గాయం కనిపించకున్నా.. మో చేతిని కదల్చలేని పరిస్థితి చోటు చేసుకుంది. దీంతో.. అతన్ని కన్ఫెషన్ రూంకి తరలించారు. అక్కడ అతన్ని పరీక్షలు జరిపారు.
కొద్ది గంటల పాటు సాగిన ఈ టాస్క్ అత్యధిక పిరమిడ్లు పెట్టిన రోల్ రైడ్ విజేతగా ప్రకటించారు. రోల్ రైడా 74 బ్లాకులతో పిరమిడ్ నిర్మిస్తే.. కౌశల్ 69 బ్లాకులతో పిరమిడ్ నిర్మించాడు. టాస్క్ పూర్తైన వెంటనే.. ఇరువురు తయారు చేసిన పిరమిడ్లను లెక్కించిన పూజా అధిక బ్లాకులతో పిరమిడ్ తయారు చేసింది రోల్ రైడా అని బిగ్ బాస్ కు తెలియజేశారు. దీంతో.. తనీష్ నుంచి రోల్ రైడాకు కెప్టెన్సీ పగ్గాల్ని అప్పగించారు.
మరోవైపు.. నూతన్ నాయుడ్ని పరీక్షించిన వైద్యులు.. భుజంలోని డిస్క్ డిస్ లోకేటెడ్ అయ్యిందని.. అతడి పరిస్థితి క్రిటికల్ గా మారటంతో ఆయన్ను హౌస్ నుంచి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడినట్లు బిగ్ బాస్ ప్రకటించారు. తనను ఇంటి నుంచి పంపే సమయంలో కౌశల్ ను పిలిచిన నూతన్.. తన పరిస్థితిని వివరించాడు. దీంతో.. తీవ్ర విషాదానికి గురైన కౌశల్.. వేదనతో కుప్పకూలాడు.
కన్ఫెషన్ రూమ్ నుంచి బయటకు వచ్చిన కౌశల్.. నూతన్ నాయుడి పరిస్థితి మిగిలిన ఇంటి సభ్యులకు చెప్పటంతో వారంతా విషాదంలో మునిగిపోయారు. కెప్టెన్సీ టాస్క్ లో తన కోసం శ్రమిస్తూ నూతన్ నాయుడు గాయం బారిన పడటంపై కౌశల్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఊహించని రీతిలో చోటు చేసుకున్న ఈ పరిణామంతో బిగ్ బాస్ హౌస్ సైలెంట్ అయిపోయింది. సభ్యులంతా ఎవరికి వారు ఆవేదనకు గురయ్యారు. ప్రేక్షకుల ఓట్లతో రెండోసారి ఇంట్లోకి అడుగుపెట్టిన నూతన్.. ఊహించని విధంగా చోటు చేసుకున్న పరిణామంతో బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.