బిగ్ బాస్ హౌస్ లోకి మ‌ళ్లీ నూత‌న్‌?

Update: 2018-08-24 08:47 GMT
భారీ రియాల్టీ ఉండాల్సిన ఉత్కంట లేకుండా పోవ‌టం బిగ్ బాస్ సీజ‌న్ 2కు చెల్లుతుంది. ఈ షోకు సంబంధించిన కీల‌క అంశాల‌న్నీ ముందుగానే లీకుల రూపంలో బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి. ఈ కార‌ణంతోనే ఈ షో మీద ఆస‌క్తి ఉన్నా ఉత్కంట లేని ప‌రిస్థితి. దీంతో.. ఈ షోకు సంబంధించిన అప్ డేట్స్ ను షో చూడ‌టం కంటే కూడా.. సోష‌ల్ మీడియాను పాలో కావ‌టం ద్వారా కొత్త కొత్త విష‌యాలు తెలుస్తున్న ప‌రిస్థితి.

ఏ వారం ఎవ‌రు ఎలిమినేట్ అవుతారో.. ఎవ‌రు రీఎంట్రీ ఇస్తారో.. ఇలా ఒక‌టి కాదు రెండు కాదు.. షో మొద‌లైన నాటి నుంచి లీకుల నొప్పి బిగ్ బాస్ టీంను వెంటాడి వేధిస్తోంది. తాజాగా అలాంటి లీకు మ‌రొక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చింది. మొన్నా మ‌ధ్య టాస్క్ లో భుజానికి దెబ్బ త‌గిలి.. అత్య‌వ‌స‌ర వైద్య సాయం కోసం షో నుంచి వెళ్లిన నూత‌న్ నాయుడు మ‌ళ్లీ రీఎంట్రీ ఇవ్వ‌నున్న‌ట్లుగా తెలుస్తోంది.

గాయం కార‌ణంగా షో నుంచి వెళ్లిన నూత‌న్ మ‌ళ్లీ తిరిగి వ‌స్తారా?  రారా?  అన్న దాని మీద హౌస్ లోని స‌భ్యుల మ‌ధ్య పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. గ‌తంలో ఒక‌సారి ఎలిమినేట్ అయిన నూత‌న్..త‌ర్వాత ప్రేక్ష‌కుల ఓటింగ్ ద్వారా శ్యామ‌ల‌తో క‌లిసి రీఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.

అయితే.. ఇందుకోసం నూత‌న్ భారీగా ఖ‌ర్చు చేసిన‌ట్లుగా సోష‌ల్ మీడియా కోడై కూసింది. సామాన్యుడి కోటాలో వ‌చ్చిన నూత‌న‌.. త‌న రీఎంట్రీ త‌ర్వాత కౌశ‌ల్ కు ఫుల్ స‌పోర్ట్ గా ఉండ‌ట‌మే కాదు.. హౌస్ స‌భ్యుల ప‌ట్ల ప‌రుషంగా వ్య‌వ‌హ‌రిస్తున్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. అనారోగ్యం కార‌ణంగా నూత‌న్ హౌస్ నుంచి వెళ్లి పోతున్న విష‌యాన్ని బిగ్ బాస్ వెల్ల‌డించిన‌ప్పుడు కౌశ‌ల్ కుప్ప‌కూలిపోవ‌టాన్ని మ‌ర్చిపోకూడ‌దు. మ‌రోసారి.. నూత‌న్ రీఎంట్రీ మిగిలిన వారి సంగ‌తి ఎలా ఉన్నా కౌశ‌ల్ కు మాత్రం స్వీట్ న్యూస్ గా చెప్ప‌క త‌ప్ప‌దు. నూత‌న్ షో నుంచి ఎలిమినేట్ అయ్యార‌న్న మాట‌ను నాని ఇంత‌వ‌ర‌కూ చెప్ప‌క పోవ‌టం చూస్తే.. నూత‌న్ మ‌రో రీఎంట్రీ ప‌క్కా అని చెబుతున్నారు. శ‌నివారం షోలో అత‌గాడి ఎంట్రీ ఉంటుంద‌ని తెలుస్తోంది.
Tags:    

Similar News