రామ్ గోపాల్ వర్మ-అక్కినేని నాగార్జున కాంబినేషన్లో తెరకెక్కిన కొత్త సినిమా ‘ఆఫీసర్’ను మే 25న రిలీజ్ చేయాలని చాన్నాళ్ల కిందటే ఫిక్సయ్యారు. నాలుగు కిందట ట్రైలర్ లాంచ్ చేసినపుడు కూడా ఆ విషయాన్ని ధ్రువీకరించారు. కానీ విడుదలకు ఇంకో పది రోజులు మాత్రమే సమయం ఉన్నా కూడా పెద్దగా ప్రమోషన్ల హడావుడి కనిపించడం లేదు. దీంతో అనుకున్న ప్రకారం సినిమా రిలీజవుతుందా అన్న సందేహాలు నెలకొన్నాయి జనాల్లో. ఆ సందేహాల్నే నిజం చేస్తూ ఈ చిత్రాన్ని వాయిదా వేసేశారు. మే 25న ఈ సినిమా విడుదల కావట్లేదు. ‘ఆఫీసర్’ ఆగమనం జూన్ 1న అని రామ్ గోపాల్ వర్మ ఈ రోజు ట్విట్టర్లో వెల్లడించాడు. ప్రేక్షకులకు అత్యుత్తమ వీక్షణ అనుభూతిని కలిగించడానికి సాంకేతికంగా మెరుగులు దిద్దుతున్నామని.. అందుకే ఈ సినిమా వారం రోజులు వాయిదా పడిందని అన్నాడు వర్మ.
‘ఆఫీసర్’ వాయిదా పడటం ‘నేల టిక్కెట్టు’.. ‘నా నువ్వే’ సినిమాలకు కలిసొచ్చేదే. నిజానికి ఒకే రోజు మూడు సినిమాలు రిలీజ్ చేస్తే ఆ మూడింటికీ ఇబ్బందే. ఒకదాని ప్రభావం ఇంకోదానిపై ఉంటుంది. ‘నా నువ్వే’ సినిమాను ముందుకు తేవాలని అనుకున్నారు కానీ.. తర్వాత ఆలోచన మార్చుకున్నారు. మరి మూడూ వస్తే ఇబ్బంది కదా.. ఎవరో ఒకరు వెనక్కి తగ్గకపోతారా అని ఎదురు చూడగా.. సాంకేతిక కారణాలతో ‘ఆఫీసర్’ వాయిదా పడింది. షూటింగ్.. పోస్ట్ ప్రొడక్షన్ విషయంలో యమ స్పీడుగా ఉండే వర్మ.. ఇలా సాంకేతిక కారణాలు చెప్పి సినిమాను వాయిదా వేయడం ఆశ్చర్యం కలుగుతోంది. దీనిపై సందేహాలు కూడా కలుగుతున్నాయి. ‘ఆఫీసర్’పై బజ్ లేని నేపథ్యంలో ‘నేల టిక్కెట్టు’ లాంటి మాస్ సినిమాకు పోటీగా రిలీజ్ చేయడమెందుకని ఈ చిత్రాన్ని వాయిదా వేసి ఉండొచ్చని కూడా అంటున్నారు. ‘ఆఫీసర్’ జూన్ 1కి వాయిదా పడటం.. ఆ రోజుకు షెడ్యూల్ అయిన ‘రాజు గాడు’కి ఇబ్బంది కలిగించేదే.