రామ్ గోపాల్ వర్మ ఆఫీసర్ ట్రైలర్ ఇందాకా విడుదల చేసారు. చాలా ఏళ్ళ తర్వాత నాగార్జునతో మూవీ చేసిన వర్మ ఈ సారి గట్టి హిట్ కొడతాను అనే నమ్మకాన్ని ముందు నుంచి వ్యక్తం చేస్తూనే ఉన్నాడు. ఇక ట్రైలర్ విషయానికి వస్తే టీజర్స్ ని కొద్దిగా ఎక్స్ టెండ్ చేసి ఇది కట్ చేసినట్టుగా అనిపిస్తోంది. సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అయిన నాగార్జున నారాయణ పసారి అనే అధికారి హత్య కేసు విచారణ కోసం ముంబై వస్తాడు. అతనికో కూతురు ఉంటుంది. మాఫియా తో యుద్ధం. ప్రతి మనిషిలోను ఒక దేవుడు ఒక రాక్షసుడు ఉంటాడు అని ట్రైలర్ ఓపెనింగ్ షాట్ లో చెప్పించిన వర్మ పాత్ర స్వభావాన్ని చూచాయగా చెప్పేసాడు. హైదరాబాద్ నుంచి ఇన్వెస్టిగేషన్ కోసం వచ్చిన ఆఫీసర్ కు ముంబై లో ఎదురైన సవాళ్ళు విపత్కర పరిస్థితులే ఈ సినిమా ప్లాట్ గా కనిపిస్తోంది. కూతురి రూపంలో సెంటిమెంట్ కూడా టచ్ చేసిన వర్మ గ్లామర్ కోసం తీసుకున్న మైరా సరీన్ ను యాక్షన్ పార్ట్ లో బాగా వాడుకున్నట్టు కనిపిస్తోంది.
ట్రైలర్ మొత్తం తన మార్క్ యాక్షన్ ట్రీట్మెంట్ తో నింపేసిన వర్మ నాగార్జునను బాగా ఎనర్జిటిక్ గా చూపించాడు. సినిమా మొత్తం చేజులు, ఫైట్లు బాగానే ఉన్నట్టు స్పష్టమైంది. రవి శంకర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రెగ్యులర్ వర్మ స్టైల్ లో ఉండగా భరత్-రాహుల్ కెమెరా పనితనం మంచి స్టాండర్డ్ లో ఉంది, రెండు పాటలు టచ్ చేసిన వర్మ ఇంకా ఇందులో ఎన్ని ఉంటాయో హింట్ ఇవ్వలేదు. మొత్తానికి నాగ్ ని చాలా కాలం తర్వాత ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో చూడబోతున్న ఆఫీసర్ ట్రైలర్ ఫాన్స్ కు నచ్చేలా ఉంది. గతంలో మే 25 అంటూ రిలీజ్ డేట్ ప్రకటించినప్పటికీ ఇప్పుడు మాత్రం ట్రైలర్ చివరిలో కమింగ్ సూన్ అని ఇచ్చారు. అంటే ఏదైనా మార్పు జరిగే అవకాశం ఉందేమో. యాక్షన్-సెంటిమెంట్-వయోలెన్స్ ఈ మూడింటిని సమపాళ్ళలో మిక్స్ చేసి నాగ్ ను వర్మ ప్రెజెంట్ చేసిన తీరు పూర్తి స్థాయిలో చూడాలంటే ఇంకొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు.
వీడియో కోసం క్లిక్ చేయండి
Full View