బాలీవుడ్ లో ఉన్న ఫైనెస్ట్ ఆర్టిస్టుల్లో ఆదిత్యరాయ్ కపూర్ ఒకడు. క్లాసిక్ పెర్ఫామెన్సెస్ తో కట్టి పడేయగల సమర్థుడు. గుజారిష్ - ఆషిఖి 2లో అతడి అసమాన నటప్రదర్శన అందుకు నిదర్శనం. `యూరి` లాంటి అవకాశాన్ని జస్ట్ లో మిస్సయ్యాడు కానీ.. అతడు ఇంకా పెద్ద స్టార్ గా ఎదిగి ఉండేవాడని అప్పట్లో టాక్ వినిపించింది. ఏదైతేనేం ఇప్పుడు యూరి తరహాలోనే ఓ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో తన అభిమానులను అలరించేందుకు వస్తున్నాడని తాజా టీజర్ తో ప్రూవ్ చేస్తున్నాడు.
ఆదిత్య రాయ్ - సంజన సంఘీ నటించిన `ఓం: ది బ్యాటిల్ వితిన్` మొదటి టీజర్ విడుదలైంది. జీ స్టూడియోస్ - అహ్మద్ ఖాన్ గతంలో ఆదిత్య రాయ్ కఠినమైన రూపాన్ని ఆవిష్కరించారు. ఇప్పుడు వీడియోలో ఆదిత్య దేశం కోసం చనిపోవడానికి సిద్ధంగా ఉన్న సైనికుడి పాత్రలో కనిపించాడు. ఆదిత్య ప్రత్యర్థులను చితక్కొట్టడం .. యాధృచ్ఛికంగా తుపాకీలను కాల్చడం వంటి భీకరమైన యాక్షన్ విన్యాసాలు రక్తి కట్టిస్తున్నాయి.
హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలతో టీజర్ ప్యాక్ చేసి విడుదల చేయడం ఆసక్తికరం. బాలీవుడ్ లోని దేశభక్తి చిత్రాలలో ఓం కూడా ఒక ప్రత్యేక చిత్రంగా చేరిపోతుందని టీజర్ భరోసానిస్తోంది. అయితే యూరి తరహాలోనే ఈ చిత్రం ఆద్యంతం గ్రిప్పింగ్ నేరేషన్ తో తెరకెక్కిందా లేదా? అన్నది పూర్తి సినిమా చూస్తే కానీ చెప్పలేం. విక్కీ కౌశల్ తరహాలోనే గొప్ప ప్రతిభావంతుడైన ఆదిత్య రాయ్ ఈ సినిమాతో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడు? అన్నది వేచి చూడాలి.
ఈ సినిమా కోసం సన్నద్ధమవుతున్న విధానంపై ఆదిత్య ఇంతకుముందు మాట్లాడాడు. కఠినమైన వర్కౌట్ పాలన గురించి ఓపెన్ గా చర్చించాడు. "ఇది ఒక అద్భుతమైన ప్రయాణం.. నా అభిమానులందరితో సినిమా విజువల్స్ పంచుకోవడం నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. ఇది సవాలుగా ఉన్నా కానీ లాభదాయకమైన ప్రయత్నం. సపోర్ట్ చేసినందుకు నా దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు. ఈ సంపూర్ణ ఎంటర్ టైనర్ లో అన్ని ఎలిమెంట్స్ ప్రేక్షకులకు నచ్చుతాయి. ఆదరిస్తారని నేను నమ్ముతున్నాను! " అని రాసాడు.
కపిల్ వర్మ ఈ చిత్రంతో దర్శకుడిగా ప్రయాణం మొదలు పెట్టాడు. "ఇది హిందీ చిత్రాల ప్రపంచంలోకి నా మొదటి వెంచర్.. ఇప్పటివరకు అద్భుతమైన ప్రయాణం. నమ్మశక్యం కాని నటీనటులు సాంకేతిక నిపుణులతో `OM: ది బ్యాటిల వితిన్` తెరకెక్కింది. అభిమానులందరి కోసం ఒక క్లిష్టమైన డిజైన్ తో రూపొందించిన భారీ కాన్వాస్ ఉన్న చిత్రమిది. సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి వేచి ఉండలేం" అని అన్నారు.
జీ స్టూడియోస్- అహ్మద్ ఖాన్ సమర్పణలో జీ స్టూడియోస్- షైరా ఖాన్ - అహ్మద్ ఖాన్ ల ఎ పేపర్ డాల్ ఎంటర్ టైన్ మెంట్ ప్రొడక్షన్ బ్యానర్లలో కపిల్ వర్మ దర్శకత్వం వహించిన 'ఓఎమ్ -ది బ్యాటిల్ వితిన్' 2022 జూలై 1న విడుదలకు సిద్ధంగా ఉంది. ఓం మాత్రమే కాకుండా ఆదిత్య నుంచి విడుదలకు అనేక ప్రాజెక్ట్ లు రెడీగా ఉన్నాయి.
ది నైట్ మేనేజర్ రీమేక్ .. యాక్షన్ థ్రిల్లర్ తడమ్ కోసం భారతదేశం సహా శ్రీలంక అంతటా చిత్రీకరణలో పాల్గొంటున్నాడు. తడమ్ అదే పేరుతో 2019 తమిళ చిత్రానికి హిందీ రీమేక్. ఒరిజినల్ కి అనువాదకుడు మగిజ్ తిరుమేని. ఇందులో అరుణ్ విజయ్ ద్విపాత్రాభినయం చేయగా తాన్యా హోప్- స్మ్రుతి వెంకట్ - విద్యా ప్రదీప్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.
Full View