సౌత్ లో మోస్ట్ క్రేజీ.. క్యూట్ కపుల్ అనగానే అందరికి గుర్తుకు వచ్చే పేర్లలో మొదటగా నయనతార మరియు విఘ్నేష్ శివన్ ఉంటాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. హీరోయిన్ గా నయనతార వరుస సినిమాలతో దూసుకు పోతున్న ఈ సమయంలో విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో దూసుకు పోతున్నాడు. వీరిద్దరు కలిసి రౌడీ పిక్చర్స్ బ్యానర్ ను ఏర్పాటు చేసి సినిమాలను నిర్మిస్తున్నారు. పెద్ద చిన్నా అనే తేడా లేకుండా మంచి కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలను వీరు నిర్మిస్తున్నారు. ఈమద్య కాలంలో వీరి నుండి వచ్చిన సినిమా కూజాంగల్. ఈ సినిమా ఒక మంచి మెసేజ్ మరియు కంటెంట్ తో రూపొందింది. సినిమాకు కమర్షియల్ గా పెద్దగా ఫలితం పాజిటివ్ గా రాలేదు కాని అరుదైన అవకాశంను మాత్రం ఈ సినిమా దక్కించుకుంది.
2022 మార్చిలో జరుగబోతున్న ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవంకు గాను ఈ సినిమా ఎంపిక అయ్యింది. ఇండియా ఆస్కార్ నామినేషన్స్ ను ఎంపిక చేసే జ్యూరీ మెంబర్స్ మొత్తం 14 సినిమాలను వీక్షించడం జరిగింది. తమిళంకు చెందిన మండేలా సినిమా ఇప్పటికే ఆస్కార్ నామినేషన్స్ లో చోటు దక్కించుకుంది. చివరి స్టెప్పు వరకు వెళ్లే విషయమై క్లారిటీ లేదు కాని మండేలా సినిమా ఆ జాబితాలో చేరడమే చాలా గొప్ప విషయంగా తమిళ మీడియా మరియు ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో తమిళం నుండి మరో సినిమాకు ఆ జాబితాలో చోటు దక్కడం అనేది చాలా పెద్ద విషయం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు తమిళ సినీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కూజాంగల్ సినిమా ఆస్కార్ ఆస్కార్ నామినేషన్స్ బరిలో నిలవడం పై నిర్మాత అయిన విఘ్నేష్ శివన్ ఆనందం వ్యక్తం చేశాడు. అండ్ ది ఆస్కార్ గోస్ టు అనే పదం కోసం వెయిట్ చేస్తున్నట్లుగా విఘ్నేష్ పేర్కొన్నాడు. ఆస్కార్ గెలిచేందుకు ఈ సినిమా మరో రెండు అడుగుల దూరంలో ఉంది. ఫైనల్ నామినేషన్ లో ఈ సినిమాకు ప్లేస్ దక్కాలి. ఆ తర్వాత ఫైనల్ నామినేషన్ నుండి ఒక్క సినిమాగా ఎంపిక అవ్వాల్సి ఉంటుంది. అప్పుడే ఈ సినిమాకు అవార్డు వస్తుంది. మరి సౌత్ స్టార్ కపుల్ చేసిన ఈ ప్రయత్నం వర్కౌట్ అయ్యి సినిమాకు ఆస్కార్ దక్కతుందా అనేది చూడాలి.