పవన్ కళ్యాణ్ పై ‘పవర్ స్టార్’ అంటూ సినిమా తీస్తున్న దర్శకుడు రాంగోపాల్ వర్మకు నిన్న రాత్రి పవన్ అభిమానుల నుంచి సెగ తగిలింది. హైదరాబాద్ లోని వర్మ ఆఫీసును ముట్టడించి ఆందోళన చేశారు. ఆ వేడి ఇంకా చల్లారకముందే వర్మకు మరో వార్నింగ్ వచ్చింది.
పవన్ కళ్యాణ్ ను కించపరిస్తే సహించబోమని.. దర్శకుడు రాంగోపాల్ వర్మకు తగిన గుణపాఠం చెబుతామని ఉస్మానియా యూనివర్సిటీ జాక్ అధ్యక్షుడు సంపత్ హెచ్చరించారు. గురువారం వర్మ కార్యాలయంపై జరిగిన దాడి ఘటనపై ఓయూలో సంపత్ విలేకరులతో మాట్లాడారు.
పవన్ కళ్యాణ్ ను కించపరిచేలా సినిమా తీస్తున్న రాంగోపాల్ వర్మతో మాట్లాడడానికి ఆయన కార్యాలయంలోకి వెళ్లామని.. వర్మ భయపడి దాక్కున్నాడని ఎద్దేవా చేశారు.
ఈ సందర్భంగా పవన్ పై రాజకీయంగా విమర్శలు చేయవచ్చు కానీ.. వ్యక్తిగతంగా విమర్శలు చేయడం తగదని వర్మకు హితవు పలికారు. వర్మకు సంబంధించిన కార్యాలయం వారు తమకు సారీ చెప్పారని.. ఇంతటితో విషయాన్ని వదిలేయాలని కోరారని.. వర్మ తన వైఖరి మార్చుకోవాలని హెచ్చరించారు.