ప్రభాస్ కు బాహుబలి తర్వాత ఉత్తర భారతంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు అయ్యారు అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా ప్రభాస్ కు జపాన్ లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. అక్కడ ప్రభాస్ కు అభిమాన సంఘాలే ఉన్నాయి అనడంలో సందేహం లేదు. ఆమద్య ప్రభాస్ బర్త్ డే కోసం జపాన్ లో భారీ ఎత్తున వేడుకలను అభిమానులు నిర్వహించారు. ఇదే సమయంలో ఇండియాలో కూడా చాలా మంది జపనీస్ అభిమానులు ఆయన్ను కలిసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపేందుకు ప్రయత్నించారు. జపాన్ లో ప్రభాస్ క్రేజ్ ఏంటో మరోసారి నిరూపితం అయ్యింది.
జపాన్ లో ప్రభాస్ నటించిన 'సాహో' సినిమా ఏకంగా 250 రోజులు ప్రదర్శితం అయ్యింది. ఈమద్య కాలంలో ఏ ఇండియన్ సినిమా ఇండియాలో కనీసం వంద రోజులు కూడా ఆడే పరిస్థితి లేదు. ఒకప్పుడు వందల రోజులు ఆడేవి. కాని ఇప్పుడు అలా ఆడటం లేదు. 50 రోజులు ఆడిందంటే అదే చాలా గొప్ప విషయంగా చెబుతున్నారు. కాని సాహో మాత్రం జపాన్ లో 250 రోజుల పాటు కంటిన్యూగా ప్రదర్శింపబడుతుందని చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. ఒక ఇండియన్ సినిమాకు ఈ స్థాయి గౌరవం రావడం నిజంగా అరుదు. ప్రభాస్ సాహో సినిమా భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఉంటుంది. అందుకే బాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. ఇప్పుడు జపనీస్ అభిమానులు కూడా సాహోను ఎంజాయ్ చేస్తున్నారు.