ఈ ప్రపంచంలో ప్రేమ ను డిఫైన్ చేసిన వాడు.. ప్రేమకు ఒక డెఫినిషన్ చెప్పి దాంతో అందరినీ ఒప్పించిన వాడు లేడు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మలైకా అరోరా - అర్జున్ కపూర్ ల మధ్య ఉండేది 'ప్రేమ' అని ఎవరైనా అంటే మెజారిటీ జనాలు ఒప్పుకోరు. ఒకవేళ వయసే కనుక టాపిక్ అయితే.. వారిది ప్రేమ కానప్పుడు రణబీర్ - అలియాల మధ్యలో ఉండేది ప్రేమ ఎలా అయ్యింది? ప్రియాంక - నిక్ ల మధ్య ఉండేది ప్రేమ ఎలా అయ్యింది? రణబీర్ అలియాల మధ్యలో పదేళ్ళ తేడా ఉంటే.. ప్రియాంక - నిక్ ల మధ్యలో 11 ఏళ్ళు వయసు తేడా ఉంది. ఇక మలైకా- అర్జున్ కపూర్ ల మధ్య 13 ఏళ్ళ తేడా ఉంది.
అలా కాదు మలైకా పిల్లల తల్లి.. రెండో పెళ్లి లాంటి లాజిక్ లు కనుక చెప్తే..బాలీవుడ్ స్టార్ హీరోల రెండో.. మూడో పెళ్లి పురాణాలు అన్నీ ప్రస్తావించుకోవాలి. అమీర్ ఖాన్.. సంజయ్ దత్.. సైఫ్ అలీ ఖాన్.. ఈ బ్యాచ్ కి అంతా పెళ్లి వయసున్న పిల్లలున్నారు. కానీ రెండో పెళ్లి చేసుకొని మళ్ళీ పిల్లలను కన్నారు. మలైకాను చీల్చి చెండాడేవారు ఈ బ్యాచ్ ను కూడా చీల్చి చెండాడాల్సిందే. లాజికల్ గా అయితే వీళ్ళు చేసే పనే మలైకా చేస్తోంది. కాకపోతే మనది పురుషాధిక్య సమాజం కావడంతో మలైకాను మాత్రం ప్రత్యేకంగా టార్గెట్ చేసి తప్పు అంటున్నారు. మలైకా వివాహితగా ఉన్నప్పుడు అర్జున్ కపూర్ తో వచ్చిన ఎఫైర్ గాసిప్స్ గురించి మాట్లాడితేమాత్రం ఎవరూ మలైకాను సమర్థించలేం. ఒకవేళ అవి నిజమే అయితే ఆమెను తప్పుపట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు అర్బాజ్ ఖాన్ - మలైకా జంట విడాకులు తీసుకొని విడిగా ఉంటున్నారు కాబట్టి ఆ ఎఫైర్ల టాపిక్ అనేది గతం.
ఈమధ్య మలైకా -అర్జున్ కపూర్ ల పెళ్లి వార్తలు వస్తున్నాయి. కానీ సొసైటీ మాత్రం అర్జున్- మలైకా జంటను అదోరకంగా చూస్తోందనేది మాత్రం వాస్తవం. జనాలు ఏమనుకున్నా అటు అర్జున్ కపూర్ ఫ్యామిలీ నుండి.. ఇటు మలైకా పేరెంట్స్ నుండి మాత్రం ఈ జంటకు సపోర్ట్ దక్కింది. ముఖ్యంగా మలైకా నిర్ణయానికి ఆమె తల్లిదండ్రులు పూర్తిమద్దతుగా నిలుస్తున్నారట. 'జనాలు ఉంటే ఉంటారు పోతే పోతారు' అనుకుని తమ కూతురు సంతోషంగా ఉండాలని మాత్రం డిసైడ్ అయ్యి.. మలైకాకు సపోర్ట్ చేస్తున్న వారి మోడరన్ థింకింగ్ చూసి చాలామంది ముక్కున వేలేసుకుంటున్నారు. కొంతమంది సంప్రదాయవాదులు తిట్టిపోస్తున్నారు.