టాలీవుడ్ ప్రిన్స్ - సూపర్ స్టార్ మహేష్ బాబుతో హీరోయిన్ గా నటించే అవకాశం వస్తే.. ఏ హీరోయిన్ అయినా ఎగిరి గంతేస్తుంది అనడంలో సందేహం లేదు! ఇదే సమయంలో స్టార్ డైరెక్టర్ మురుగదాస్ సినిమా లో హీరోయిన్ గా అవకాశం వస్తే.. అప్పుడు కూడా ఎవరూ వెనక్కి తగ్గరనే చెప్పాలి. ఈ రెండు అవకాశాలు కలిసి వచ్చినా కూడా "నో" చెప్పింది బాలీవుడ్ బ్యూటీ పరిణితీ చోప్రా!
విషయానికొస్తే.. మహేష్ బాబు - మురుగదాస్ కాంబినేషన్ లో రెడీ అవుతోన్న క్రేజీ ప్రాజెక్టు కోసం తర్వాత చాలామంది హీరోయిన్స్ ని అనుకున్నా.. ముందుగా సంప్రదించింది మాత్రం పరిణితీ చోప్రానేనట. ఈ ఆఫర్ ను పరిణితి రిజక్ట్ చేసిందన్న సంగతి తెలిసిందే. అయితే పరిణితీ ఈ ప్రాజెక్టు చేయకపోవడానికి భారీగా డిమాండ్ చేయడమే కారణమని రకరకాల వార్తలు షికార్లు చేసాయి. వీటిపై తాజాగా స్పందించింది ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ.
మహేష్ తో నటించే అవకాశం తాను కావాలని వదులుకోలేదని, అధికమొత్తంలో రెమ్యునరేషన్ డిమాండ్ చేయలేదని చెప్పింది. అసలు ముందుగా తనను సంప్రదించినా కూడా.. కేవలం కాల్షీట్లు సెట్ కాకపోవడంతోనే మరో ఆప్షన్ లేక వదులుకున్నానని, అంతే తప్ప ముందుగా వచ్చిన రూమర్స్ అన్నీ అవాస్తవాలని క్లారిటీ ఇచ్చింది.