మహేష్ కోసం అడగడం ఒకటే రైట్

Update: 2016-07-12 07:53 GMT
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో మురుగదాస్ తీయనున్న ద్విభాషా చిత్రానికి గాను..  హీరోయిన్ ఎవరో ఇప్పుడిప్పుడే తేలుతోంది. వచ్చే నెల నుంచి రకుల్ ప్రీత్ సింగ్ షూటింగ్ లో జాయిన్ అవుతుందని సమాచారం అందుతోంది. ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాకపోయినా.. రకుల్ ని ఫైనల్ చేసేసుకోవచ్చు. అసలు ఈ మూవీలో హీరోయిన్ గా పరిణీతి చోప్రా సైన్ చేసిందనే టాక్ చాలాకాలం పాటే వినిపించింది.

బాలీవుడ్ బ్యూటీ పరిణీతికి 3.5 కోట్ల భారీ పారితోషికం ఇచ్చి మరీ ఈమెను హీరోయిన్ గా తెచ్చుకున్నారనే టాక్ చాలాకాలమే వినిపించింది. అయితే.. ఇవన్నీ ఇప్పుడు రూమర్స్ అని తేల్చేసింది పరిణీతి. వాస్తవానికి ఈ మూవీ మేకర్స్ తనను సంప్రదించిన మాట నిజమేనని మాత్రం ఒప్పుకున్న ఈ బ్యూటీ.. కొంత మేర టాక్స్ కూడా జరిగాయని చెప్పింది. ప్రాజెక్టుకు తాను సైన్ చేయాలా వద్దా అనే నిర్ణయం తీసుకోలేదని.. వాళ్లు అడిగిన డేట్స్.. తనకు బాలీవుడ్ లో ఉన్న కమిట్మెంట్స్ కి మధ్య క్లాష్ రావడంతో ఆలోచనలో పడ్డానని చెప్పింది.

ఈ లోపుగానే మీడియాకి లీకులు అందడం.. తీసుసేకున్నారనే ప్రచారం జరిగిందంటూ క్లారిటీ ఇచ్చింది పరణీతి. ఇదే కాదని.. ఏ మూవీ విషయంలో అయినా సరే తాను సంతకం చేస్తే.. దానిపై తన నుంచి స్పష్టత తీసుకోవాలని ఓ సలహా ఇచ్చిందీ భామ.
Tags:    

Similar News