తెలుగు కథకు కొత్త మాటలు నేర్పి, కొత్త బాటలో ముందుకు నడిపించిన కథారచయితలలో పరుచూరి బ్రదర్స్ స్థానం ప్రత్యేకం. మహామహులతో కలిసి కొన్ని వందల సినిమాలకి పనిచేసిన అపారమైన అనుభవం వాళ్ల సొంతం. మారుతున్న తరాలు .. ప్రేక్షకుల అభిరుచులను దృష్టిలో పెట్టుకుని, ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని తమ కండువాకు కట్టేసుకోవడం వారి ప్రత్యేకత. తమ అనుభవాలను పాఠాలుగా అందించడానికి పరుచూరి గోపాలకృష్ణ ఒక వేదికను ఏర్పాటు చేసుకున్నారు. అదే 'పరుచూరి పాఠాలు'. ఈ కార్యక్రమంలో ఈ వారం ఆయన 'నిశ్శబ్దం' సినిమాను గురించి మాట్లాడారు.
అనుష్క ప్రధాన పాత్రధారిగా దర్శకుడు హేమంత్ మధుకర్ 'నిశ్శబ్దం' సినిమాను తెరకెక్కించాడు. థ్రిల్లర్ నేపథ్యంలో నిర్మితమైన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకులను పలకరించింది. అనుష్క అంగీకరించిందంటే ఆ కథలో వైవిధ్యం ఉండే ఉంటుందనే ఉద్దేశంతో అంతా ఆసక్తిని చూపించారు. కానీ ఈ సినిమా వాళ్లందరినీ పూర్తిగా నిరాశపరిచింది. అలాంటి ఈ సినిమాను గురించి పరుచూరి గోపాలకృష్ణ ప్రస్తావించారు. "హేమంత్ మధుకర్ దర్శకత్వంలో 'నిశ్శబ్దం' వచ్చింది. ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ద్వారా వస్తున్న సినిమాల్లో ఏవి విజయవంతమయ్యాయనేది తెలియడం లేదు. అలాగే 'నిశ్శబ్దం' ఎంతవరకూ శబ్దం చేసిందనేది తెలియడం లేదు.
కోన వెంకట్ కి రచయితగా ఒక మార్క్ ఉంది. ఆ ముద్రను ఆశించే ప్రేక్షకులు థియేటర్స్ కి వస్తారు. వాళ్లు అనుకున్నట్టుగా లేకపోతే ఆ సినిమాలు ఆడవు. త్రివిక్రమ్ మొదటి నుంచి కూడా 'పంచ్' డైలాగ్స్ రాస్తూ నవ్విస్తూ వచ్చారు. కాస్త వెరైటీగా ఉంటుందని ఆయన 'పంచ్'లు లేకుండా రాసిన సినిమాలు దెబ్బతిన్నాయి. అలా కోన వెంకట్ పేరు చూడగానే, ఆ సినిమాలో అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ఉంటుందని ప్రేక్షకులు అనుకుంటారు. అందుకు కారణం గతంలో ఆయన ఎన్నో సినిమాల ద్వారా నవ్వించారు. ఇంతకుముందు ఆయన రాసిన 'గీతాంజలి' సినిమా కూడా 'నిశ్శబ్దం' మాదిరిగానే థ్రిల్లర్. కానీ ఆ సినిమాలో ఆయన ఎంతగానో నవ్వించాడు. ఆ నవ్వులనే ఆయన 'నిశ్శబ్దం' సినిమా నుంచి దూరం చేశారు.
'నిశ్శబ్దం' సినిమాకి కోన వెంకట్ స్క్రీన్ ప్లే చేశారు. ఆ స్క్రీన్ ప్లే ద్వారా .. మాధవన్ పాత్ర చనిపోయిందనే విషయాన్ని ఆయన ముందుగానే చెప్పేశారు. మాధవన్ పాత్ర చనిపోయిన తరువాత దాని గురించిన కథ చెబుతుంటే ఆడియన్స్ కి వినబుద్ధి కాదు .. అది మొదటి దోషం. మాధవన్ వంటి మంచి ఇమేజ్ ఉన్న ఆర్టిస్ట్ చేసిన పాత్రను ఓపెనింగులోనే చంపేయడం కరెక్టు కాదు. అలాగే ఈ సినిమాలో విలన్ 'మైఖేల్' అనే విషయాన్ని కూడా ముందుగానే చెప్పేశారు. అలా చేయడం వలన తరువాత ఏం జరుగుతుందోననే ఇంట్రెస్ట్ పోతుంది. ఉన్న సీన్లనే ఎక్కడ ఎప్పుడు చెప్పాలో అక్కడ చెబితే భలేగా ఉండేది.
ఇక మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ కథ విదేశాల్లో నడవడం. 'గీతాంజలి' మన ఇంటి పక్కన జరుగుతున్నట్టుగా ఉంటుంది. 'నిశ్శబ్దం' కథ అంతా విదేశంలో జరుగుతుంది .. దాంతో ఇది మన కథ కాదు అనే ఫీలింగ్ ఆడియన్స్ లో వచ్చేసింది. ఇక అందాల అనుష్కను మాటలురాని పాత్రలో చూపించడం మరో మైనస్ గా మారింది. ఇలా కొన్ని ముఖ్యమైన ఎలిమెంట్స్ మిస్సవ్వడం వల్లనే 'నిశ్శబ్దం' నిరాశపరచడానికి కారణమయ్యిందేమోనని అనిపించింది" అంటూ తన మనసులోని మాటను చెప్పుకొచ్చారు.