ఇలా కంగారు పెట్టి..క‌న్య్పూజ్ చేస్తే ఎలా? ప‌వ‌న్ అన్నా!

Update: 2022-12-11 05:35 GMT
కొద్ది సేప‌టి క్రిత‌మే ప‌వ‌న్ క‌ళ్యాణ్  'ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్' అని కొత్త టైటిల్ తో ఓ సినిమా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఉద‌య‌మే పీకే అభిమానులు ఒక్క‌సారిగా కంగారుప‌డ్డారు. గంద‌రగోళానికి గుర‌వుతున్నారు...క‌న్య్పూజ‌న్ ప‌డుతున్నారు. అవును అవ్వ‌రా?  మ‌రి... ముందు 'భ‌వ‌దీయుడు భ‌గ‌త్' సింగ్ అన్నారు. ఇప్పుడు 'ఉస్తాద్  భ‌గ‌త్ సింగ్' అంటున్నారు.

ఇవి రెండు వేర్వేరు  సినిమాలునా?  లేక 'భ‌వ‌దీయుడు' ని  తీసేసి 'ఉస్తాద్' ని తెచ్చారా?  లేక రెండు వేర్వేరు క‌థ‌లా? ఒకేసారి పీకే హ‌రీష్ తో రెండు సినిమాలు చేస్తున్నాడా? ఇలా ఒక‌టేంటి స‌వాల‌క్ష సందేహాలు అభిమానుల పుర్రెల్ని తొలి చేస్తున్నాయి. ఒక‌వేళ దీన్ని  మార్పుగానే అనుకుంటే?  ఇప్ప‌టికిప్పుడు ఉన్న‌ట్లుండి ఈ మార్పు ఎందుకు చేయాల్సి వ‌చ్చింది?

అందుకు గల కార‌ణాలు ఏంటి?  'మ‌న‌ల్ని ఎవ‌డ్రా ఆపేది' అనే సబ్ టైటిల్ దేనికి సంకేతం? 'భ‌వ‌దీయుడు' అని రాసిన‌ప్పుడు 'ఉస్తాద్' ఐడియా త‌ట్ట‌లేదా? ద‌ర్శ‌కుడికి గానీ..ఆ క‌థ‌లో న‌టిస్తున్న  క‌థానాయ‌కుడిగానీ! మ‌రో వైపు ఇది తేరి రీమేక్ అంటున్నారు.

ఆ సినిమా మాకొద్ద‌ని అభిమానులు  స్ర్టెయిట్ గానే ప‌వ‌న్...హ‌రీష్ ల‌కు చెబుతున్నారు. నేడు ప్ర‌క‌టించిన కొత్త టైటిల్ పోస్ట‌ర్ లోనూ ఇది రీమేక్ కాదు అని చెప్ప‌లేదు. రీమేక్ అంటే?  అవున‌ని చెప్ప‌లేదు. సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచిన '#WeDontWantTheriRemake' అన్న దానికి బ‌ధులు ఎందుకు ఇవ్వ‌డం లేదు?  ఆదివారం ఉద‌యాన్నే ఈ వార్త ఏంటి? అంటూ అభిమానులు ఒక‌టే త‌ల ప‌ట్టుకుంటున్నారు.

ఇక 'మ‌న‌ల్ని ఆపేది ఎవ‌డ్రా' అనే విష‌యానికి వ‌స్తే....పోస్ట‌ర్ లో దీన్ని చాలా పెద్ద‌గా హైలైట్ చేసారు. ఈ ప‌దం 'ఇప్ప‌టం' గ్రామ  వివాదంలో తెర‌పైకి వ‌చ్చింది.  ప్ర‌భుత్వానికి-జ‌న‌సేనానికి మ‌ధ్య రాజ‌కీయంగా త‌లెత్తిన వివాదం నేప‌థ్యంలో వెలుగులోకి వ‌చ్చి ప‌దం ఇది. ఈ ప‌దాన్ని ప‌వ‌న్ క‌ళ్యాణ్  త‌న సినిమా కోసం   వినియోగిస్తున్నారు. ఇప్పుడు దీన్ని  తీసుకొచ్చి ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్  కింద త‌గిలించారు. మ‌రి ఇది ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఐడియానా? ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ క్రియేటివిటీనా? అన్న‌ది ఆ పెరుమాళ్ల‌కే తెలియాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News