`వ‌కీల్ సాబ్`కి కొత్త‌ ఉత్సాహం వ‌చ్చింది!

Update: 2020-05-23 04:15 GMT
తెలంగాణ ప్ర‌భుత్వం అన్ని ప‌రిశ్ర‌మ‌ల‌కు వెసులుబాటు క‌ల్పించి సినీప‌రిశ్ర‌మ‌పై ఆచితూచి అడుగులు వేయ‌డంతో సినీజ‌నం ఒక్క‌సారిగా ఖంగు తిన్నారు. నేడో రేపో షూటింగుల‌కు అనుమ‌తులు ల‌భిస్తాయ‌ని ఆశిస్తే మ‌రో రెండు మూడు నెల‌ల వ‌ర‌కూ అందుకు ఆస్కారం లేద‌ని త‌ల‌సాని అనేయ‌డంతో కాస్త త‌డ‌బ‌డ్డారు. ప్యాచ్ వ‌ర్కులు ఉన్న వాళ్లంతా మ‌రీ ఎక్కువ కంగారు పడ్డారు. ఆ క్ర‌మంలోనే మెగాస్టార్ చిరంజీవి పూనుకుని ప‌రిశ్ర‌మ పెద్ద‌ల‌తో మీటింగ్ ఏర్పాటు చేసి త‌ల‌సాని కేసీఆర్ ని క‌లిసి ఇండ‌స్ట్రీ స‌మ‌స్య‌ల్ని విన్న‌వించారు. ఆయ‌న చొర‌వ‌తో ఆల్మోస్ట్ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ స‌హా షూటింగుల‌కు అనుమ‌తి లభించింద‌న్న చర్చ సాగుతోంది.

అన్న‌య్య చొర‌వ త‌మ్ముడికి అక్క‌ర‌కొచ్చింది. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ వ‌రుస‌గా మూడు సినిమాల‌కు సంత‌కాలు చేసి వ‌కీల్ సాబ్ స‌హా వేరొక చిత్రాన్ని ప‌రుగులు పెట్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆన్ లొకేష‌న్ ఆయ‌న ఎంతో సిన్సియ‌ర్ గా షూటింగుల్లో పాల్గొంటున్నారు. అయితే ఈలోగానే మ‌హ‌మ్మారీ త‌రుముకొచ్చింది. దాంతో వకీల్ సాబ్ షూటింగ్ కొన్ని స‌న్నివేశాలు స‌హా ప్యాచ్ వ‌ర్కులు నిలిచిపోయాయి. నాలుగైదు రోజుల షూటింగ్ తోనే పోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ పూర్తి చేసేయాల‌నుకుంటే మ‌హ‌మ్మారీ మీద ప‌డింది.

అందుకే ఇప్పుడు సీఎం కెసీఆర్ జూన్ నుంచి ఫిల్మ్ షూట్స్ కి అనుమతించడంతో తొలిగా ఊపిరి పీల్చుకున్న‌ది ప‌వ‌ర్ స్టారేన‌ని చెప్పుకుంటున్నారు. ఇంకా చెప్పాలంటే ఇత‌రుల‌తో పోలిస్తే పవన్ కళ్యాణ్ వెంట‌నే చిత్రీక‌ర‌ణ ప్రారంభించేయాల‌ని ఎగ్జ‌యిట్ అయ్యార‌ట‌. వకీల్ సాబ్ దాదాపు పూర్తయింది. కొద్ది రోజులు మాత్రమే షూట్ పెండింగ్ ఉంది. అందుకే వేగంగా పూర్తి చేయాల‌ని నిర్మాత దిల్ రాజుతో చ‌ర్చించార‌ట‌. ఇక ఇత‌ర షూటింగులు కూడా జూన్ నుంచి ప్రారంభం కానున్నాయి.
Tags:    

Similar News