'సర్దార్' హడావిడి మొదలైపోయింది. ఏప్రిల్ 8నే సినిమా రిలీజ్ అవుతుంది. దీంతో సినిమా టికెట్లు సంపాదించే పనులో ఉన్నారు అభిమానులు. ఇప్పటికే అన్ని చోట్ల మూడు రోజుల వరకు టికెట్స్ అన్నీ అమ్ముడిపోయాయి. దీన్ని బట్టి సర్దార్ ప్రభంజనం సృష్టించడం ఖాయంగానే కనిపిస్తోంది. అయితే ఈ సినిమా నిడివి దాదాపు 2 గంటల 42 నిమిషాలు ఉందని సమాచారం. కాని ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ రెండు గంటల 15 నిమిషాలు లేదా 20 నిమిషాలు మాత్రమే ఉంటున్నాయి. అంతకంటే ఎక్కువ డ్యూరేషన్ ఉంటే భరించడం చాలా కష్టం.
ప్రేక్షకులకు సినిమా చూడడానికి విసుగొస్తుంది. అయితే పవన్ స్క్రీన్ మీద ఎంతసేపు ఉన్నా ప్రేక్షకులు చూస్తారనే కాన్ఫిడెన్స్ తో అసలు నిడివి గురించి పట్టించుకోలేదు దర్శక నిర్మాతలు. కాని ప్రాక్టికల్ గా వర్కవుట్ అవుతుందో లేదో అనే చిన్న టెన్షన్ తో నిర్మాత శరత్ మరార్ పవన్ ను కలిసి నిడివి తగ్గించమని అడిగారట. పవన్ కళ్యాణ్ మాత్రం సినిమా నిడివి తగ్గించేదేలేదని తేల్చి చెప్పేశాడట. దీంతో శరత్ మరార్ పరిస్థితి వివరించి చెప్పాడట. సినిమా హిట్ అయిన తరువాత అదనపు సన్నివేశాలని యాడ్ చేద్దామని చెప్పి, మొదట పావుగంట సినిమాను ట్రిమ్ చేయమని ప్రాధేయపడ్డాడు. దీంతో పవన్ అంగీకరించాడని తెలుస్తోంది. ఓ పది నిమిషాల పాటు సినిమాను ట్రిమ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.