పీకే క్రియేటివ్ వ‌ర్క్స్ లో సినిమాల ప్లాన్?

Update: 2019-11-18 03:34 GMT
బాలీవుడ్ లో కండ‌ల హీరో స‌ల్మ‌న్ ఖాన్ కెరీర్ జర్నీ గురించి తెలిసిందే. ఓవైపు క‌థానాయ‌కుడిగా బ‌య‌టి బ్యాన‌ర్ల‌లో న‌టిస్తూనే.. సొంత బ్యాన‌ర్ సినిమాలు చేస్తున్నాడు. ఇత‌ర నిర్మాత‌ల‌తో టై అప్ లు పెట్టుకుని భారీ చిత్రాల్ని నిర్మించ‌డం చూస్తున్న‌దే. చాలా కాలంగా స‌ల్మాన్ సొంత నిర్మాణ సంస్థ‌లోనే ద‌బాంగ్ సిరీస్ సినిమాలు చేస్తున్నాడు. ఇవ‌న్నీ బంప‌ర్ హిట్లు కొట్టి వంద‌ల కోట్లు వ‌సూలు చేస్తున్నాయి. బాలీవుడ్ లో ఖాన్ ల త్ర‌యం స‌ల్మాన్ - షారూక్- అమీర్ ఖాన్ ఇదే త‌ర‌హాలో సొంత బ్యాన‌ర్ల‌లో సినిమాలు చేయ‌డం స‌క్సెస్ అందుకోవ‌డం చూస్తున్న‌దే.

ఆ ఫార్ములాని మ‌న స్టార్లు ఇప్ప‌టికే అడాప్ట్ చేసుకుని దూసుకుపోతున్నారు. ఈ విష‌యంలో సూప‌ర్ స్టార్ మ‌హేష్ చాలా స్పీడ్ లో ఉన్నాడు. చ‌ర‌ణ్ .. త‌ర్వాత అదే బాట‌లో బ‌న్ని- ఎన్టీఆర్ కూడా  సొంత నిర్మాణ సంస్థ‌ల్ని ఎస్టాబ్లిష్ చేసే ప్లాన్ లో ఉన్నారు. డాడ్ అర‌వింద్ అండ‌దండ‌లు ఉన్నా బ‌న్ని సొంతంగా బ్యాన‌ర్ ని ఎస్టాబ్లిష్ చేసే ప్లాన్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే.

ఇక ఇదంతా స‌రే కానీ.. చాలా కాలంగా సినిమాల‌కు దూరంగా ఉండి రాజ‌కీయాల్లో బిజీ అయిన ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ సైతం ఇదే బాట‌లో సొంత బ్యాన‌ర్ సినిమాల‌కు సిద్ధ‌మ‌వుతున్నారా? అంటే అవున‌నే తాజాగా స‌మాచారం అందింది. ప్ర‌స్తుతం ప‌వ‌న్ రీఎంట్రీ గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. పింక్ రీమేక్ లో న‌టించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని బోనీక‌పూర్ తో క‌లిసి దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నార‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. అయితే ఈ సినిమాలో న‌టించ‌డ‌మే కాదు ప‌వ‌న్ క‌ల్యాణ్ క్రియేటివ్ వ‌ర్క్స్ లో సినిమాలు నిర్మించేందుకు ప‌వ‌న్ రెడీ అవుతున్నార‌ని స‌మాచారం. ప‌వ‌న్ రీఎంట్రీ పై అభిమానుల్లో భారీ అంచ‌నాలున్నాయి. అలాగే ప‌వ‌న్ - రేణు దేశాయ్ వార‌సుల్ని టాలీవుడ్ లో ఎస్టాబ్లిష్ చేయాల్సిన టైమ్ వ‌చ్చేసింది. అందుకే పీకే క్రియేటివ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్ ని రీబూట్ చేస్తున్నార‌ని మెగా కాంపౌండ్ వ‌ర్గాలు వెల్ల‌డిస్తున్నాయి. త‌న బ్యాన‌ర్ లో తానే న‌టిస్తూ సినిమాలు నిర్మించే ఆలోచ‌న‌లో ప‌వ‌న్ ఉన్నార‌ట‌. ఒక‌వేళ ఇదే నిజ‌మైతే ఈ బ్యాన‌ర్ లో ట్యాలెంటెడ్ ద‌ర్శ‌కులు... టెక్నీషియ‌న్ల‌కు భారీగానే అవ‌కాశాలు ద‌క్కుతాయ‌న‌డంలో సందేహం లేదు. ఇప్ప‌టికే తాను క‌మిట్ మెంట్లు ఇచ్చిన ద‌ర్శ‌కుల‌కు సొంత బ్యాన‌ర్ లో సినిమాలు చేసే అవ‌కాశం ఉంది.

Tags:    

Similar News