సినిమా షూటింగుల విషయంలో మునుపెన్నడూ లేని అనూహ్య మార్పులు చోటు చేసుకోనున్నాయా? అంటే అవుననే తాజా సన్నివేశం చెబుతోంది. ఇంతకుముందుతో పోలిస్తే ఆన్ లొకేషన్ శుచి-శుభ్రత అంటూ నియమాలు పాటించాల్సి ఉంటుంది. మాస్క్ లు.. శానిటైజర్లు.. సామాజిక దూరం తప్పనిసరి. అయితే ఇన్ని రూల్స్ పెట్టుకుని పని చేయాలంటే అందుకు కచ్ఛితంగా ముందస్తు ప్రిపరేషన్ అవసరం అని నిర్మాతలు భావిస్తున్నారు. సెట్స్ లో పని చేసేవాళ్లకు మునుపు ఉన్నంత స్వేచ్ఛ ఉండదు. ఎంతో జాగ్రత్తలు తీసుకుని పని చేయాల్సి ఉంటుంది.
అందుకే జూన్ నుంచి షూటింగులకు అనుమతించినా కానీ.. సేఫ్టీ ఎంత అన్నదానిపై నానా విధాలుగా తర్జనభర్జన పడుతున్నారట. ఆన్ లొకేషన్ హీరోలకు ఏదైనా తేడా కొడితే పరిస్థితిని అదుపులో ఉంచలేమన్న ఆందోళన నెలకొందని చెబుతున్నారు. ఈ విషయంలో వకీల్ సాబ్ నిర్మాత దిల్ రాజు కాస్తంత ఎక్కువ ఆందోళన చెందడమే గాక.. ఆన్ లొకేషన్ జాగ్రత్తల విషయంలో కఠినంగా వ్యవహరించనున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా పవర్ స్టార్ విషయంలో ఎలాంటి అశ్రద్ధా లేకుండా జాగ్రత్త పడనున్నారట.
అందుకే ముందుగా పవన్ లేకుండా షెడ్యూల్ చేస్తున్నారు. కొద్ది రోజుల పాటు అంతా సవ్యంగా సాగుతోందా లేదా? అన్నది చెక్ చేసుకుని అప్పుడు పవన్ ని పిలుస్తారట. పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ఈ సంవత్సరం విడుదల కానున్న భారీ క్రేజీ చిత్రం. మిగతా అన్ని పెద్ద బడ్జెట్ సినిమాలు 2021 కు వాయిదా పడ్డాయి. అందువల్ల వకీల్ సాబ్ పై క్రేజు రెట్టింపైంది.
ఈ మూవీకి సంబంధించి ఇంకా 20 రోజులు పైగా షూట్ ఇంకా మిగిలి ఉంది. ఈ పార్ట్ ని చాలావరకు కోర్టు గదిలో చిత్రీకరించాల్సి ఉంటుంది. జూన్ 1నుంచి మొదలయ్యే షూటింగులో ఫ్రేమ్ లో పవన్ కళ్యాణ్ అవసరం లేని షాట్లు తీస్తారట. రూల్స్ పాటిస్తూ పరిమిత సిబ్బందితో చిత్రీకరణకు సిద్ధమవుతున్నారు. మొట్ట మొదటి సారి ఇలాంటి కండిషన్ లో షూట్ జరుగనుందన్నమాట.