``వ్యవసాయం.. పల్లెటూరి నేపథ్యంలో స్వచ్ఛమైన సినిమా తీసి మెప్పించారు. శర్వా మరోసారి తనదైన నటనతో కట్టి పడేశాడు`` అంటూ ప్రశంసించారు క్రాక్ దర్శకుడు గోపిచంద్ మలినేని. శర్వా కథానాయకుడిగా కిషోర్.బి దర్శకత్వంలో రామ్ ఆచంట- గోపీ ఆచంట నిర్మించిన 'శ్రీకారం' మహా శివరాత్రి సందర్భంగా మార్చి 11న విడుదలైంది. ఈ సినిమా సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ గోపిచంద్ మలినేని ప్రశంసలు కురిపించారు.
శ్రీకారం లో తాను చెప్పాలనుకున్న పాయింట్ ను దర్శకుడు నిజాయితీగా చెప్పాడు. నేను అప్పుడప్పుడు సంక్రాంతికి ఇంటికెళ్లినప్పుడు టౌన్ నుంచి తమ పిల్లలు వస్తారని తల్లిదండ్రులు ఎదురుచూడటాన్ని గమనించాను. కాబట్టి.. ఈ సినిమా ప్రజలకు బాగా కనెక్ట్ అవుతుందని గోపీచంద్ అన్నారు. కేవలం ఈ సినిమా కోసం తిరుపతి సమీపంలో 40ఎకరాల వ్యవసాయ భూమి తీసుకుని నిర్మాతలు పండించారని వ్యవసాయంపై నిజాయితీగా తెలుసుకున్నారని మలినేని తెలిపారు.
నవతరం దర్శకులు అజయ్ భూపతి- బాబి `శ్రీకారం` దర్శకనిర్మాతలు కథానాయకుడిపై ప్రశంసలు కురిపించారు. శర్వానంద్ కెరీర్ లోనే తొలిరోజు అత్యధిక వసూళ్లు నమోదయ్యాయని నిర్మాతలు వెల్లడించగా.. మానవతా విలువలు.. ఎమోషన్స్ ను దర్శకుడు కిషోర్ తెరపై చాలా నేచురల్‌గా చూపించారని.. మంచి సినిమాలు తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి ప్రూవ్ అయ్యిందని అతడు అన్నారు. ఈ సినిమా చూసేందుకు జనం ట్రాక్టర్లు కట్టుకుని మరీ థియేటర్లకు వస్తున్నారని దర్శకుడు కిషోర్ ఆనందం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ సినిమా చూసి థియేటర్ల నుంచి తృప్తిగా బయటకు వస్తున్నారని .. యువతరం తమ తల్లిదండ్రులను కూడా తీసుకెళుతున్నారని రచయిత సాయిమాధవ్ బుర్రా అన్నారు.