తండ్రి జ్ఞాపకాలతో మెగా కుటుంబం..!

Update: 2022-12-24 16:35 GMT
పండుగ ఏదైనా సరే మెగా ఫ్యామిలీ అంతా కలిసి ఒకేచోట చేరి ఆ వేడుకని సెలబ్రేట్ చేసుకుంటారు. ఫెస్టివల్స్ లేకపోయినా సరే ప్రతి వీకెండ్ షూటింగ్ లేని వారంతా కలిసి ఎంజాయ్ చేస్తారు. అయితే మెగా ఫ్యామిలీ పార్టీలకు పవన్ ఒక్కడే అటెండ్ అవ్వడం కొద్దిగా కష్టం. లేదు చేసేది పెద్ద పార్టీ పవన్ కూడా రావాల్సిందే అని డిమాండ్ చేస్తే మాత్రం ఆయన కూడా వచ్చేస్తాడు. మెగా బ్రదర్స్ విత్ సిస్టర్స్ ఇంకా అంజలి దేవి ఈ ఫోటో చాలా కలర్ ఫుల్ గా ఉంటుంది. అయితే ఇలాంటి ఫోటో ఒకటి నేడు షేర్ చేశారు మెగాస్టార్ చిరంజీవి.

తన తండ్రి కొణిదెల వెంకట్రావు వర్ధంతి సందర్భంగా ఆయన్ను గుర్తు చేసుకుంటూ చిరు ఇంట్లో తండ్రికి నమస్కరించి కార్యక్రమాన్ని పూర్తి చేశారు. అయితే ఇదే టైం లో ఒకప్పటి తండ్రితో తన ఫ్యామిలీ మొత్తం కలిసి దిగిన ఫోటోని షేర్ చేశారు చిరంజీవి. అందులో చిరుతో పాటుగా నాగబాబు, చిరు సిస్టర్స్ ఇద్దరు, అమ్మ అంజలి దేవి, పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. చిరు షేర్ చేసిన ఈ ఫ్యామిలీ పిక్ మెగా ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకుంటుంది.

తండ్రి తమని ఎలా పెంచారో చెబుతూ ఒక మెసేజ్ కూడా చేశారు చిరు. ఈరోజు జరిగిన కార్యక్రమంలో పవన్ మిస్ అయినట్టు తెలుస్తుంది. తండ్రి ఫోటోకి హారతి అందిస్తూ చిరు తండ్రి మీద తనకున్న ప్రేమని, గౌరవాన్ని చూపిస్తున్నారు. కానిస్టేబుల్ గా పనిచేసిన కొణిదెల వెంకట్రావు చిరంజీవి హీరో అవుతానంటే మొదట వద్దని వారించినా ఆ తర్వాత అతన్ని ప్రోత్సహించారు.

తండ్రి జ్ఞాపకాలతో ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా తండ్రి వెంకట్రావు పై తనకున్న ప్రేమను ఇలా చూపించారు చిరంజీవి. చిరంజీవితో పాటు నాగబాబు కూడా ఈ సంవత్సరీకం కార్యక్రమంలో పాల్గొన్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News