మలయాళ సూపర్ హిట్ 'అయ్యప్పనుమ్ కోషియమ్' తెలుగు రీమేక్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - దగ్గుబాటి రానా కలిసి నటిస్తున్న సంగతి తెలిసిందే. సాగర్.కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి స్క్రీన్ప్లే - డైలాగ్స్ అందిస్తున్నాడు. ఇటీవలే ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇకపోతే మెగా దగ్గుబాటి హీరోలు కలిసి నటిస్తున్న ఈ సినిమాపై సినీ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. దీనికి తగ్గట్టే ఇందులో నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ గా పవన్.. అతనిని ఢీకొట్టే పాత్రలో రానా కనిపించనున్నారు.
అయితే తెలుగు వర్షన్ లో పవన్ ని దృష్టిలో పెట్టుకుని స్టోరీలో మార్పులు చేర్పులు చేశారని.. రానా పాత్ర కాస్త తగ్గే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. కానీ మలయాళంలో బిజు మీనన్ - పృథ్విరాజ్ పాత్రల మాదిరిగానే ఇక్కడ కూడా పవన్ - రానా రోల్స్ సమానంగా ఉంటాయని తెలుస్తోంది. ఒకరికొకరు ధీటుగా నిలబడే ఈ పాత్రలకు తగ్గట్టే త్రివిక్రమ్ శ్రీనివాస్ తనదైన శైలిలో సంభాషణలు రాస్తున్నారట. ఇద్దరి మధ్య వచ్చే డైలాగ్స్ పోటాపోటీ ఉంటాయని.. త్రివిక్రమ్ తరహాలో చాలా లోతుగా ఆలోచింపజేసేస్తూ ప్రత్యేకంగా నిలుస్తాయని సినీ వర్గాల్లో చెప్పుకుంటున్నారు. ఇక పవన్ - రానా ల మధ్య వచ్చే యాక్షన్ సీన్స్ హైలైట్ గా ఉంటాయట. మరి ఈ మల్టీస్టారర్ తెలుగులో ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.