ఆ టివి ప్రోగ్రామ్స్ పై కేసు పెట్టారు

Update: 2017-05-17 07:15 GMT
''నవ్వించడం బొగం నవ్వకపోవడం రోగం'' అని చార్లీ చాప్లిన్ ఏ క్షణాన అన్నారో కాని.. దాన్ని మన వాళ్ళు పట్టుకొని ఊదరగొడుతున్నారు. దాని కోసం మన తెలుగు టి‌వి వాళ్ళు ఎలాంటి వాటినైనా వాడటానికి సిద్దపడుతున్నారు. ఇక ఎప్పటి నుంచో సూపర్ హిట్ టివి షో జబర్దస్త్ పైన బూతు మాటలతో షో నడిపిస్తున్నారు అని ఒక వాదన ఉంది. కానీ దాన్ని ఎవ్వరూ అంతపెద్దగా పాటించుకోలేదు. ఇప్పుడు ఆ షో లో చేసే స్కిట్లు శృతి మించి బూతు ఉండటంతో ఒక పెద్దమనిషికి కోపం వచ్చి పోలీసు కంప్లయింట్ ఇచ్చాడు.  

సెన్సార్ బోర్డు సభ్యుడు నందనం దివాకర్  హైద‌రాబాద్‌ లోని బాలానగర్ పోలీస్ స్టేషన్‌ లో ఆయన ఫిర్యాదు చేసారు. కార్యక్రమాల్లో వాడుతున్న డైలాగ్లు ఫ్యామిలితో కలిసి చూశేలా లేవని ఈ  రెండు ప్రోగ్రాంలు యువతను ఆలోచనలు పైన వారి ప్రవ్తన పైన చెడు ప్రభావం చూపిస్తుంది అని  ఇలాంటి వాటిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. నటి రాజకీయ నాయకురాలు అయిన రోజా.. నిర్మాత నటుడు మెగా బ్రదర్ నాగబాబు.. లాంటి వ్యక్తుల ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలకు జరుగడం బాధాకరమని అన్నారు.

ఇంకా కొద్ది రోజులు కిందట మరో  ప్రముఖ తెలుగు దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కూడా  'నా ఆలోచన' పేరుతో తన మనసులోని ఆలోచనలను జనాలతో పంచుకుంటున్న సంగతి తెలిసిందే. ఆయన కూడా  “ఈటీవీలో ప్రసారం అవుతున్న కార్యక్రమాలు చూడలేక పోతున్నాం బూతు జోకులు మరీ ఎక్కువ అవుతున్నాయి అని అవి కూడా  రామోజీ రావు లాంటి గొప్పవారు నిర్వహిస్తున్న ఛానల్స్ లో ప్రసారం కావడం బాధగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. క్లీన్ కామిడీ కావలంటే ఇప్పుడు ఉన్న జనాలికి ఒక  హాస్య బ్రహ్మ జంధ్యాల సరిపోడు కనీసం పదిమంది కావాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News