నందమూరి బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ అంటే హ్యాట్రిక్ హిట్స్ కనిపిస్తాయి. సింహా, లెజెండ్, అఖండ సినిమాలతో వీరిద్దరూ బ్లాక్ బస్టర్ హిట్స్ ని ఖాతాలో వేసుకున్నారు. అందుకే బాలయ్య అభిమానులకి బోయపాటితో సినిమా అంటే ఒక కాన్ఫిడెన్స్ వచ్చేస్తోంది. బాలకృష్ణని సిల్వర్ స్క్రీన్ పై ఎలా చూపించాలో బోయపాటికి తెలిసినంతగా ఎవరికి తెలియదని నమ్ముతారు.
ఇదిలా ఉంటే బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో నాలుగో సినిమాని కూడా ఇప్పటికే కన్ఫర్మ్ చేసేశారు. ఎన్బీకె109 మూవీగా ఇది రాబోతోంది. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ మూవీ చేస్తున్నాడు. దసరాకి ఈ సినిమా రిలీజ్అ అవ్వనుంది. దీనిని రిలీజ్ చేసిన వెంటనే బోయపాటితో సినిమాని పట్టాలెక్కించే పనిలో బాలకృష్ణ ఉన్నారు.
బోయపాటి శ్రీను కూడా ఇప్పటికే బాలకృష్ణ కోసం అదిరిపోయే కథని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. కంప్లీట్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ప్రస్తుత రాజకీయాలకి అద్దం పట్టేలా సామాజిక అంశాలని తీసుకొని ఈ ఈ చిత్రాన్ని బోయపాటి తెరపై ఆవిష్కరించనున్నారని తెలుస్తోంది. ఇప్పటి వరకు బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన మూడు చిత్రాలలో పొలిటికల్ టచ్ పెద్దగా లేదు.
ఒక్క లెజెండ్ సినిమాలో కొంత వరకు పొలిటికల్ టచ్ ఉన్న అది మెయిన్ లైన్ కాదు. కేవలం రెండు కుటుంబాల మధ్య గొడవని ప్రధాన ఇతివృత్తంగా చూపించారు. ఇక అఖండ కాన్సెప్ట్ అయితే రిలీజియన్, మాఫియాని కలిపి సరికొత్తగా ఆవిష్కరించారు. ఇప్పుడు ఎన్బీకె109 కోసం పూర్తిగా పొలిటికల్ యాక్షన్ డ్రామాగా తెరపై చూపించడానికి సిద్ధం అవుతున్నాడు.
ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్, గీతా ఆర్ట్స్ సంయ్తుక్తంగా నిర్మించనున్నాయంట. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని వచ్చి ఏడాది ఎన్నికల లోపు రిలీజ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి ఈ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోయే బాలయ్య సినిమాలో బోయపాటి ఎలాంటి అంశాలని టచ్ చేయబోతున్నాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.