పూల‌బుట్టలో చిక్కిన బంతిపూల జాన‌కి

Update: 2021-11-22 06:32 GMT
ముంబై బ్యూటీ పూజాహెగ్డే రేంజ్ అమాంతం స్కైని ట‌చ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. `అల‌వైకుంఠ‌పురములో` స‌క్సెస్ త‌ర్వాత త‌న క్రేజు ప‌దింత‌లైంది. రెమ్యున‌రేష‌న్ ని ఒక్క‌సారిగా హైక్ చేసింది. ఒక్కో సినిమాకు 3 కోట్లు ఛార్జ్ చేయ‌డం..సెట్స్ కు వెళ్లాలంటే చార్టెడ్ ప్లైట్ డిమాండ్ ..బాడీ గార్డుల‌ను రంగంలోకి దించ‌డం..మ‌ళ్లీ అంతే సేఫ్ గా నిర్మాతలే అమ్మ‌డిని ఇంటి ద‌గ్గ‌ర దింప‌డం.. ఇదీ ముంబై బ్యూటీ రేంజ్ అనేంత‌గా ప‌రిశ్ర‌మ‌లో చ‌ర్చ సాగుతోంది. ఇటీవ‌లే పూజా న‌టించిన `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్` రిలీజై ఘ‌న‌విజ‌యం సాధించిన‌ సంగ‌తి తెలిసిందే. ఇందులో న‌ట‌న‌కు ఆస్కారం ఉన్న పాత్ర‌తో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది.

సినిమాల‌ సంగ‌తి ప‌క్క‌న బెడితే పూజా .. సోష‌ల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో తెలిసిందే. ఈ మ‌ధ్య కాలంలో ఆ స్పీడ్ మ‌రింత పెంచింది. గ‌త రెండు.. మూడు రోజులుగా వ‌రుస‌గా మాల్దీవుల వెకేష‌న్ నుంచి వ‌రుస‌ ఫోటోల‌తో హీటెక్కించింది.

స్విమ్ షూట్.. టూపీస్ లో ర‌చ్చ చేసింది. తాజాగా పూజా ఓ మ్యాగ‌జైన్ క‌వ‌ర్ షూట్ కి సంబంధించిన మ‌రో ఫోటోగ్రాఫ్ వైరల్ గా మారింది. ఇది ట్రెడిష‌న‌ల్ లుక్.. ఈ కొత్త గెట‌ప్ లో మ‌రోసారి బుట్ట‌బొమ్మ‌ని త‌ల‌పించింది. బంతిపూల‌ బుట్ట‌ల‌ మ‌ధ్య‌లో ముద్ద బంతిపువ్వులా అందంగా త‌యారై క‌నిపించింది.

బంతిపువ్వు రంగులోనే డిజైన‌ర్ లెహంగా లుక్ లో ఆక‌ర్ష‌ణీయంగా కనిపించి ఆక‌ట్టుకుంది. `వెడ్డింగ్ అండ్ హ‌నీమూన్స్` మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీ కోసం ఇలా ఫోజులిచ్చింది. ఈ క‌వ‌ర్ పేజీ కోసం పూజా ఫోజులివ్వ‌డం ఇది రెండ‌వసారి కావ‌డం విశేషం.

ఇక్క‌డ మ‌రో సంగ‌తి కూడా ఉంది. ఇది పూజా హెగ్డే ఫేవ‌రెట్ మ్యాగ‌జైన్ అని కూడా రివీల్ చేసింది. హిల్ట‌న్ గోవా రిసార్స్ట్ లో ఈ ఫోటో షూట్ జ‌రిగింది. కాజోల్ ములానీ మ్యాక‌ప్ ఆర్టిస్ట్ గా.. హెయిర్ స్టైలిస్ట్ సుహాస్ షిండే.. ఫోటోగ్ర‌ఫీ తార‌స్ తారాపోరావాల అందించారు.

ప్ర‌స్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో వైర‌ల్ గా మారింది. పూజాహెగ్డే చేస్తోన్న సినిమాల లైన‌ప్ చూస్తే ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న `రాధేశ్యామ్` లో.. మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తోన్న `ఆచార్య‌`లో న‌టిస్తోంది. అలాగే కోలీవుడ్ లో విజ‌య్ స‌ర‌స‌న `బీస్ట్` లో న‌టిస్తోంది. ఇక బాలీవుడ్ లో ర‌ణ‌వీర్ సింగ్ తో క‌లిసి `సిర్క‌స్`లో న‌టిస్తోంది. ఇది పాన్ ఇండియా రేంజులో రిలీజ్ కానుంది.




Tags:    

Similar News