ప్రభాస్ ను పెళ్లాడతానంటున్న హీరోయిన్

Update: 2017-03-13 08:24 GMT
ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే మరో మాట లేకుండా ప్రభాస్ పేరు చెప్పేస్తారు. ఇంకా చెప్పాలంటే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో అతనొకడు. ‘బాహుబలి’తో ప్రభాస్ అంత పేరు తెచ్చుకున్నాడు మరి. మామూలు అమ్మాయిలే కాదు.. హీరోయిన్లు సైతం అతనంటే పడి చచ్చిపోతున్నారు.

‘రైట్ రైట్’ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమై.. ఇటీవలే ‘ద్వారక’ సినిమాలోనూ తళుక్కుమన్న పూజా జవేరి కూడా ఆ జాబితాలోనే ఉంది. ఆమెకు ప్రభాస్ అంటే చచ్చేంత ఇష్టమట. ప్రభాస్ ఒప్పుకుంటే అతణ్ని పెళ్లి చేసుకోవడానికి తాను రెడీ అని స్టేట్మెంట్ ఇచ్చేసింది పూజా జవేరి. మరి ప్రభాస్ అందుకు ఒప్పుకుంటాడేమో చూడాలి.

అమ్మాయిల్లో ఇంత ఫాలోయింగ్.. డిమాండ్ ఉన్న ప్రభాస్ ఇంకా పెళ్లి పీటలెక్కకపోవడం ఆశ్చర్యమే. అతడికి ఇప్పటికే 37 ఏళ్లు వచ్చేశాయి. మూణ్నాలుగేళ్ల నుంచి ఇదిగో అదిగో అంటున్నారు కానీ.. ప్రభాస్ పెళ్లి సంగతేంటో తేలట్లేదు. ‘బాహుబలి’ అవ్వగానే పెళ్లన్నారు. ఆ సినిమా పూర్తి చేసి కూడా మూడు నెలలవుతోంది. అయినా ప్రభాస్ పెళ్లి కబురు వినిపించట్లేదు. ప్రభాస్ ఊ అనాలే కానీ బడా బడా ఫ్యామిలీల నుంచి అందమైన అమ్మాయిలు అతడి కోసం క్యూలో నిలుస్తారు. మరి ప్రభాస్-కృష్ణం రాజుల వేట ఇంకా ఎందుకు పూర్తి కావట్లేదో?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News