నిర్మాతగా కిరణ్ కె తలశిల తెలుగులో క్రేజీ ప్రాజెక్ట్స్, క్రేజీ అంకుల్స్ జస్ట్ శాంపిల్ మాత్రమే.!
నిర్మాత అనే క్రాఫ్ట్ ఎంతో రిస్క్ తో కూడుకున్నది, అందుకే ఒక్క సినిమా చేయడానికే నిర్మాతలు ఎన్నో విషయాలను పక్కాగా పరిశీలించి సినిమాని నిర్మిస్తుంటారు. ఇలా పెద్ద పెద్ద నిర్మాతలే ఒక్కో సినిమా తర్వాత ఒక్కో సినిమా చేస్తుంటే, డైనమిక్ అండ్ పాషనేట్ ప్రొడ్యూసర్ కిరణ్ కె తలశిల మాత్రం తను నిర్మాతగా పరిచయం అవుతున్న మొదటి ఏడాదే, ఒకేసారి రెండు మూడు భాషల్లో నాలుగు సినిమాలను రిలీజ్ చేయడానికి అన్నీ సెట్ చేసేసారు.
ఎవరో అనుభవం లేక ఒకేసారి ఇన్ని సినిమాలు చేసేస్తున్నారేమో అనుకున్నారో మీరు మోసపోయినట్టే.. ఎందుకంటే ఆయన తెలియక ఆవేశంలో సినిమాలు చేయడం లేదు. 2018 నుంచి సౌత్ లోని అన్ని ఇండస్ట్రీలో సహా నిర్మాతగా పనిచేసి అనుభవాన్ని సంపాదించుకున్నాకే నిర్మాతగా మారారు కిరణ్ కె తలశిల. 2018 లో వచ్చిన 'భలే మంచి చౌక భేరమ్', 2019లో వచ్చిన తెలుగు - తమిళ్ ఫిలిం 'సెవెన్, జీవ 'గొరిల్లా' మూవీ మరియు కన్నడ ఫిలిం 'నాన్న ప్రకార' సినిమాలకు అసోసియేట్ నిర్మాతగా పనిచేసి, ఓ నిర్మాత స్థాయి అనుభవాన్ని సంపాదించుకున్న తర్వాతే, తన అభిరుచికి తగ్గ సినిమాలను చేయడానికి సిద్దమయ్యాడు.
2021లో మొదటగా కిరణ్ కె తలశిల నుంచి రాబోతున్న సినిమా తెలుగు హాట్ యాంకర్ శ్రీముఖి నటించిన 'క్రేజీ అంకుల్స్'. ఇది కాకుండా 'గోదారి కథలు', 'గోల్డ్ మాన్' మరియు 'నలుగురితో నారాయణ' సినిమాలు కూడా సెట్స్ పై ఉన్నాయి. తెలుగుతోనే సరిపెట్టుకోకుండా బాలీవుడ్ లో 'ఏ కాష్ కె హమ్' అనే సినిమాతో బాలీవుడ్ విలక్షణ నటుడు నజీరుద్దీన్ షా కుమారుడు వివాన్ షాన్ ని హీరోగా పరిచయం చేస్తూ, హీరోయిన్స్ గా ప్రియా సింగ్ మరియు సోఫియా సింగ్ లను పరిచయం చేస్తున్నారు.
'20 ఏళ్లుగా యుఎస్ లో బ్యాంకింగ్ ఇండస్ట్రీలో తన సత్తా చాటుకున్న కిరణ్ కి సరికొత్త ఎంటర్టైనింగ్ మెటీరియల్ తో ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయడం కొత్తేమీ కాదు. ఈస్ట్ పేస్ ఎంటర్టైన్మెంట్ (myeastface.com ) ద్వారా ఇప్పటికే కిడ్స్ మరియు యంగ్ స్టర్స్ ఫిదా అయ్యే కంటెంట్ తో ఆకట్టుకుంటున్నాడని' కిరణ్ కె తలశిల సన్నిహితులు చెబుతున్నారు. కిరణ్ కె తలశిల నిర్మాతగానే కాకుండా తన మనసుకు హత్తుకునే పాత్ర దొరికినప్పుడు నటుడిగా కుడా తెరపై కనిపించడానికి సిద్ధంగా ఉన్నారని సమాచారం. ప్రస్తుతానికైతే ఎంతో మంది కొత్తవారికి తమ డ్రీమ్స్ ని ఫుల్ ఫిల్ చేసుకునే అవకాశం ఇస్తూ, నిర్మాతగా తను కూడా ఉన్నత స్థానాలకు చేరుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నారు.