సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఓ కామెంట్ చేసినా ట్వీట్ చేసినా సినిమా తీసినా ఏం చేసినా సంచలనమే. వివాదాస్పద దర్శకుడిగా పేరుగాంచిన ఆర్జీవీ.. అప్పట్లో తన సినిమాలతో ఇండస్ట్రీకి కొత్త దారి చూపించారనే సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రపంచానికి ఫిక్షనల్ రియాలిటీ (FR) అనే సరికొత్త జోనర్ ని పరిచయం చేస్తూ.. రామ్ గోపాల్ వర్మ కిడ్నాప్ కథాంశంతో ''ఆర్జీవీ మిస్సింగ్'' అనే సినిమా రూపొందించారు.
రామ్ గోపాల్ నిర్వచనం ప్రకారం ఫిక్షనల్ రియాలిటీ అంటే రియల్ పీపుల్ మరియు రియల్ సిట్యుయేషన్స్ ఆధారంగా తీసుకోబడిన పాత్రలతో రూపొందే ఫిక్షనల్ సినిమా. అప్పుడెప్పుడో 'RGV మిస్సింగ్' సినిమాను పూర్తి చేసిన వర్మ.. ఇప్పుడు ''పవర్ స్టార్/ఆర్జీవీ మిస్సింగ్'' అనే పేరుతో ప్రమోషన్స్ మొదలు పెట్టాడు. వరుస ట్వీట్లు పోస్టర్స్ తో ప్రచారం చేస్తున్న వర్మ.. తాజాగా ట్రైలర్ ను లాంచ్ చేశారు.
'పవర్ స్టార్/ఆర్జీవీ మిస్సింగ్' ట్రైలర్ చూస్తే.. వర్మ లాక్ డౌన్ లో తీసిన 'పవర్ స్టార్' సినిమాకు ఆర్జీవీ మిస్సింగ్ కాన్సెప్ట్ ని జత చేసి చూపించబోతున్నట్లు తెలుస్తోంది. 'ఒక్క సీటు కూడా రాలేదా' అని బాధ పడుతున్న ఓ పొలిటికల్ లీడర్ ని చూపించడంతో ప్రారంభమైన ఈ టీజర్.. ఈ క్రమంలో ఫిల్మ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కిడ్నాప్ అవడం వల్ల జరిగిన పరిణామాలను చూపిస్తోంది.
కాంట్రవర్షియల్ డైరెక్టర్ ఆర్జీవీ పబ్లిసిటీ స్టంట్ గా భావించి పోలీసులు మిస్సింగ్ కేసుని లైట్ తీసుకుంటారు. కానీ ఆ తర్వాత అదే నిజమని నిర్ధారణ అవుతుంది. రామ్ గోపాల్ వర్మ కిడ్నాప్ కు ప్రవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లేదా ఒమెగా ఫ్యామిలీ లేదా మాజీ ముఖ్యమంత్రి మరియు అతని కుమారుడు అనుమానితులని చెబుతున్నారు. అయితే ఆర్జీవీ మిస్సింగ్ కేసుని ఛేదించడానికి సిన్సియర్ అండ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గజినీకాంత్ రంగంలోకి దిగడం.. అనుమానితులను తనదైన శైలిలో ఎంక్వైరీ చేయడం వంటి అంశాలతో కూడిన ఈ ట్రైలర్ కొందరు రియల్ లైఫ్ క్యారక్టర్స్ ను టార్గెట్ చేస్తున్నట్లు ఉంది.
'ఆర్జివి మిస్సింగ్' సినిమాలో చిరంజీవి - పవన్ కళ్యాణ్ - బాలకృష్ణ - నారా చంద్రబాబు నాయుడు - లోకేష్ నాయుడు - రజినీ కాంత్ - కేఏ పాల్ - కేసీఆర్ - కేటీఆర్ వంటి నిజ జీవిత పాత్రలను పోలిన వ్యక్తులు కనిపిస్తున్నారు. రామ్ గోపాల్ వర్మ ఒక్కడే ఒరిజినల్ క్యారక్టర్ ప్లే చేసాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా వెల్లడించిన రాము.. అందరి పేర్లను తప్పుగా ట్యాగ్ చేస్తూ పోస్ట్ పెట్టారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ను ఎవరు కిడ్నాప్ చేశారు? ఈ సినిమా కథ వెనుక అసలు ఉద్దేశ్యం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.
'పవర్ స్టార్/ఆర్జీవీ మిస్సింగ్' చిత్రానికి అధీర్ వర్మ దర్శకత్వం వహించారు. కేవీ ప్రొడక్షన్స్ మరియు భీమవరం టాకీస్ బ్యానర్స్ పై కెవి ఛటర్జీ - తుమ్మలపల్లి రామ సత్యనారాయణ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు రామ్ గోపాల్ వర్మ ప్రకటించారు. మరి ఇది ఓటీటీలో రిలీజ్ అవుతుందో థియేటర్లలోకి వస్తుందో వేచి చూడాలి. అలానే ఈ సినిమాపై ఎలాంటి వివాదాలు చెలరేగుతాయో చూడాలి.
Full View