క్లాసూ మాసూ రెండూ గోవిందా

Update: 2018-12-22 06:38 GMT
సినిమా పరిశ్రమలో జయాపజయాలు ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తాయో ముందే ఊహించడం కష్టం. ఒక్కోసారి స్టార్ డం ఎక్కడికో వెళ్ళిపోతుంది. డిమాండ్ పీక్స్ అందుకుంటుంది. మరోసారి ఒకే ఒక్క ఫ్లాప్ అవకాశాలన్నీ పోగొడుతుంది. అందుకే ఇది మాయలోకం లాంటిది అనేది. కాకపోతే ఒక ఇమేజ్ అంటూ వచ్చాక అది కాపాడుకోవడం ఇక్కడ చాలా ముఖ్యం. దానికి కావాల్సింది సక్సెస్. వేరే ప్రత్యాన్మాయం ఉండదు. నిన్నటి దాకా పరాజయం ఎరుగకుండా దూసుకుపోతున్న సాయిపల్లవికి ఒకేరోజు రెండు స్ట్రోక్స్ తగిలాయి.

ఎన్నో అంచనాలతో ఎంసిఎ తర్వాత ఏడాది గ్యాప్ తీసుకుని శర్వానంద్ తో సాయి పల్లవి మొదటిసారి చేసిన పడి పడి లేచే మనసు రూపంలో మొదటి దెబ్బ గట్టిగానే పడిందని ట్రేడ్ టాక్. ముఖ్యంగా సెకండ్ హాఫ్ మీద వస్తున్న కామెంట్స్ కనీసం యావరేజ్ గా నైనా నిలిచే ప్రయత్నాలకు అడ్డుకట్ట వేస్తున్నాయి. ఎంసిఎ లాంటి రొటీన్ కంటెంట్ ఉన్న సినిమానే నాని సాయిపల్లవిల ఇమేజ్ పుణ్యమా అని గట్టెక్కింది. అయితే ఈ మనసు ఆ ఛాన్స్ ఇవ్వదని తేలిపోతోంది. మరోవైపు తమిళ్ లో ధనుష్ తో ఫస్ట్ టైం చేసిన మారి 2 ఇదే ఫలితాన్ని అందుకుంది.

మొదటి భాగమే తేడా కొట్టినా దర్శకుడు బాలాజీ మోహన్ ని నమ్మి ఆఫర్ ఇచ్చిన ధనుష్ తో పాటు అతనితో మొదటిసారి నటించడమే కాక ఊరమాస్ పాత్ర చేసిన సాయి పల్లవికి కూడా షాక్ కొట్టింది. ఫ్లాప్ అయినా మొదటి భాగమే నయమంటూ క్రిటిక్స్ మారి 2 మీద విరుచుకుపడ్డారు. తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా నిన్నే విడుదలైంది కానీ థియేటర్ల కొరతతో పాటు పబ్లిసిటీ లోపం వల్ల ఇక్కడివారు పట్టించుకోవడం లేదు. చూసిన కొందరూ తమిళ్ కంటే దారుణమైన రిపోర్ట్స్ ఇస్తున్నారు. మొత్తానికి సాయిపల్లవికి డబల్ డోస్ తరహాలో రెండు షాకులు ఒకేసారి తగిలాయి. ఇక్కడ క్లాసు అక్కడ మాసూ రెండు గోవిందా కొట్టేశాయి.
Tags:    

Similar News