బాహుబలితో ప్రపంచం మొత్తం తెలిసిపోయాడు ప్రభాస్. అటు హిందీ పరిశ్రమలోనూ ఎవరీ ఆరడుగుల ఆజానుభాహుడు అన్న ఎంక్వయిరీ మొదలైంది. మలయాళం, తమిళ్, కన్నడం, మలేషియా, కెనడా, సింగపూర్, దుబాయ్, అమెరికా, బ్రిటన్.. ఇన్నిచోట్ల ప్రభాస్ ఎవరో తెలుసుకున్నారు.
ఇంతకాలం లేనిది ఇప్పుడే తెలిసొచ్చినది ఏమంటే ప్రభాస్ లాంటి ధీరుడితో సినిమా తీయాలంటే ఎక్కడ కలవాలి? హైదరాబాద్ వస్తే సరిపోతుందా? లేక అతడి నేటివ్ ప్లేస్ భీమవరం వెళ్లాలా? ఇలాంటి చర్చ కూడా సాగుతోంది విదేశాల్లో. ఎందుకంటే వీకీపిడియాలో భీమవరం బుల్లోడు ప్రభాస్ అని రాసిపెట్టి ఉంటుంది కాబట్టి.
అయితే అసలు ప్రభాస్‌కి భీమవరంకి ఏమాత్రం సంబంధం ఉంది? అని ఆరాతీస్తే కొన్ని ఆసక్తికర సంగతులు తెలిశాయి. వాస్తవానికి ప్రభాస్ తల్లిదండ్రులు, పెదనాన్న (కృష్ణంరాజు) తదితర కుటుంబ సభ్యులు భీమవరంలో ఉన్నారే కానీ, ప్రభాస్ ఎప్పుడూ భీమవరంలో ఉన్నది లేనేలేదు.
ప్రభాస్ పుట్టింది, పెరిగింది అంతా చెన్నయ్‌లోనే. అందువల్ల భీమవరంలో పెద్దగా స్నేహాలు కూడా లేవు. అప్పుడప్పుడు వెళ్లి రావడం తప్ప పెద్దగా ఆ ఊరితో మిలాఖత్ అయ్యిందేం లేదు. అందుకే ప్రభాస్ కేరాఫ్ భీమవరం అని చెప్పలేని పరిస్థితి. సునీల్ మాత్రమే భీమవరం బుల్లోడు అన్నమాట!