యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - ‘మహానటి’ ఫేమ్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో ఓ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ తెరకెక్కనున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ స్థాయిలో రూపొందనున్న ఈ సినిమాపై డార్లింగ్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ప్రభాస్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే నటిస్తుందని.. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కీలక పాత్ర పోషించనున్నారని ప్రకటించగానే ఇండస్ట్రీ వర్గాల్లోనూ అంచనాలు రెట్టింపు అయ్యాయి. దీంతో ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని జూన్ ఎండింగలేదా జూలైలో మొదలు పెట్టాలనుకుంటున్నట్లు నాగ్ అశ్విన్ ఆ మధ్య వెల్లడించారు.
అయితే ప్రస్తుతం కరోనా మహమ్మారి పరిస్థితులు దృష్ట్యా ముందు అనుకున్న ప్రకారం షూటింగ్ స్టార్ట్ చేయడం లేదట. అన్నీ అనుకున్నట్లు జరిగి పరిస్థితులు అనుకూలిస్తే దసరా లేదా దీపావళికి ప్రభాస్-నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ ని ప్రారంభించాలని మేకర్స్ అనుకుంటున్నారట. ఇప్పుడు దొరికిన ఈ సమయాన్ని చిత్ర యూనిట్.. షూటింగ్ త్వరితగతిన చేసేందుకు అవసరమైన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ - యాక్షన్ సన్నివేశాల డిజైనింగ్ - టెక్నికల్ వర్క్స్ పై మరింత దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారట. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. దీనికి లెజండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాస్ మెంటర్ గా వ్యవహరిస్తున్నారు. స్టార్ క్యాస్టింగ్ తో హై టెక్నికల్ వాల్యూస్ తో రూపొందనున్న ఈ చిత్రాన్ని భారతీయ భాషలతో పాటు పలు విదేశీ భాషల్లో కూడా విడుదల చేయనున్నారు.