బాహుబలి చిత్రంతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యాడని అనుకుంటున్నాం. కాని బాహుబలి చిత్రంతో ప్రభాస్ పాన్ వరల్డ్ స్టార్ అయ్యాడు. ఆ విషయంను నిరూపిస్తూ ప్రభాస్ తాజాగా రష్యాకు చెందిన ఒక ప్రతిష్టాత్మక అవార్డును దక్కించుకున్నాడు. ఆ అవార్డు ఇండియన్ సినిమా పరిశ్రమకు చెందిన రాజ్ కపూర్ కు 30 ఏళ్ల క్రితం వచ్చింది. మళ్లీ ఇన్నాళ్లుగా ఏ ఇండియన్ స్టార్ కూడా ఆ అవార్డును పొందలేక పోయాడు. మళ్లీ ఇన్నాళ్లకు బాహుబలి సినిమాతో రష్యా ప్రేక్షకులను అలరించిన ప్రభాస్ కు ఆ అవార్డు దక్కింది.
‘రష్యన్ ఆడియన్స్ హార్ట్’ అనే అవార్డుకు ప్రభాస్ ఎంపిక అయ్యాడు. బాహుబలి రెండు పార్ట్ లతో రష్యన్స్ హార్ట్ గెలుచుకున్న కారణంగా ఈ అవార్డును ప్రభాస్ అందుకోబోతున్నాడు. 30 ఏళ్ల క్రితం రాజ్ కుమార్ శ్రీ 420.. అవారా... ఆరాధన వంటి చిత్రాలు రష్యాలో విడుదల అయ్యి మంచి విజయం సాధించాయి. అందుకే రాజ్ కుమార్ కు రష్యన్ ఆడియన్స్ హార్ట్ అవార్డు దక్కింది. మళ్లీ ఇన్నాళ్ల వరకు రష్యన్స్ ఏ ఇండియన్ సినిమాను పెద్దగా మెచ్చింది లేదు. బాహుబలి సినిమా ఇటీవలే అక్కడ విడుదల అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
రష్యన్స్ బాహుబలి సినిమాకు బ్రహ్మరథం పట్టడంతో ఈ అవార్డు ప్రభాస్ కు దక్కింది. ప్రభాస్ నటనకు రష్యన్స్ ఫిదా అవుతున్నారు. అద్బుతమైన నటన అంటూ ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు ఏకంగా రష్యన్ ఆడియన్స్ హార్ట్ అవార్డుతో ప్రభాస్ ను గౌరవించారు. ఈ అవార్డుతో ప్రభాస్ క్రేజ్ మరోసారి నిరూపితం అయ్యింది. ప్రభాస్ త్వరలో చేయబోతున్న నాగ్ అశ్విన్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయ్యేందుకు ఈ అవార్డు హెల్ప్ అయ్యే అవకాశం ఉందంటున్నారు.