పారితోషికం విషయంలో ప్రశాంత్‌ నీల్‌ రూటే సపరేట్‌

Update: 2021-05-27 03:30 GMT
కేజీఎఫ్‌ తో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్‌ డైరెక్టర్‌ గా గుర్తింపు దక్కించుకున్న ప్రశాంత్ నీల్‌ వరుసగా తెలుగు హీరోలతో సినిమాలు చేస్తున్నాడు. కేజీఎఫ్‌ సినిమాకు ముందు ప్రశాంత్‌ నీల్‌ పారితోషికం చాలా తక్కువ ఉండేది. కేజీఎఫ్‌ మొదటి పార్ట్‌ కు కూడా ఆయన తీసుకున్న పారితోషికం చాలా తక్కువ. కేజీఎఫ్‌ 2 కు మాత్రం కాస్త ఎక్కువ పారితోషికంను అందుకున్నాడు. ఇక ఈయన ఎక్కువగా ఎందుకు తెలుగు సినిమాలకు కమిట్‌ అవుతున్నాడు అంటే పారితోషికం కారణం అంటున్నారు. కన్నడ తో పోల్చితే తెలుగు లో ఎక్కువ పారితోషికం ఉంటుంది.

కన్నడలో స్టార్‌ డైరెక్టర్‌ అయినా పది కోట్లకు అటు ఇటుగానే పారితోషికం ఉంటుంది. కాని మన టాలీవుడ్ లో మాత్రం కొందరు తెలుగు దర్శకులు మూడు లేదా నాలుగు పదుల కోట్ల పారితోషికం కూడా అందుకుంటున్నారు. అంతటి క్రేజ్ ఇక్కడ దర్శకులకు ఉంది. ఒకటి రెండు సక్సెస్‌ లు పడితే కోట్లకు కోట్లు పారితోషికం తీసుకుంటున్న టాలీవుడ్‌ లో ప్రశాంత్‌ నీల్ అందుకుంటున్న పారితోషికం చాలా తక్కువే అంటున్నారు. కన్నడ సినిమా పరిశ్రమ నుండి వచ్చిన ఆయన కు తెలుగు దర్శకుల నీరు ఇంకా పడనట్లుంది. అందుకే లాభాల్లో వాటా అంటూ ప్రత్యేక కోర్కెలు లేవు.. అలాగే పారితోషికం కూడా భారీగా చెప్పడం లేదు.

తెలుగు లో స్టార్‌ డైరెక్టర్స్ అందుకుంటున్న పారితోషికంలో సగానికి అటు ఇటుగానే తీసుకుంటున్నాడట. అందుకే ఆయనతో సినిమాలకు పలువురు నిర్మాతలు వెంటనే అడ్వాన్స్ లు ఇస్తున్నారు. ఆయన పారితోషికం తక్కువ అవ్వడంతో పాటు ఆయనకు పాన్‌ ఇండియా మార్కెట్ ఉన్న కారణంగా ఆయన అడిగిన దానికి అదనంగా ఇచ్చి మరీ అగ్రిమెంట్‌ చేసుకుంటున్నారు. టాలీవుడ్‌ దర్శకుల పారితోషికంతో పోల్చితే ప్రశాంత్ నీల్‌ పారితోషికం తీసుకునే స్టైల్‌ సరేట్‌ అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ ఉంది. మరి ప్రశాంత్ నీల్‌ ముందు ముందు కూడా ఇలాగే లిమిటెడ్‌ పారితోషికం తీసుకుంటాడా లేదంటే మన దర్శకుల మాదిరిగా మారిపోతాడేమో చూడాలి.
Tags:    

Similar News