ప్రియమణి బోయ్‌ఫ్రెండ్‌ బుక్కయ్యాడు

Update: 2015-07-14 08:13 GMT
బెంగళూరు బ్యూటీ ప్రియమణి ఇంతకాలం ఏమైంది? తెలుగు సినిమాల్లో కనిపించడం లేదేం? ఇలాంటి సందేహాలెన్నో తెలుగు అభిమానుల్ని వేదించాయి. అయితే వాటన్నిటికీ సమాధానం దొరికింది. అప్పట్లో సముద్ర దర్శకత్వంలో కొన్ని సినిమాల్లో నటించి హల్‌చల్‌ చేసిన ప్రియమణి ఉన్నట్టుండి ఎక్కడా కనిపించకుండా మాయమైంది.

అయితే దానికి కారణం ఈ అమ్మడు కెరీర్‌ని బుల్లితెరపై ప్లాన్‌ చేసింది. ప్రముఖ టీవీ చానెల్‌లో 'డి 4 డ్యాన్స్‌' పేరుతో వస్తున్న ఎపిసోడ్స్‌కి తనే జడ్జిగా కొనసాగింది. అంతేనా ఈ షోలో జడ్జిగా కొనసాగుతున్నప్పుడే ముంబైకి చెందిన ముస్తఫా రాజ్‌ అనే ఈవెంట్‌ మేనేజర్‌తో ప్రేమలో పడింది. ఈ సంగతిని ప్రియమణి స్వయంగా చెప్పింది. అంతేనా ఇప్పట్లో పెళ్లి లేకపోయినా ప్రస్తుతానికి సహజీవనం చేస్తున్నామని, అందుకు ఇరువైపులా తల్లిదండ్రులు కూడా అంగీకరించారని చెప్పింది.

తన బోయ్‌ఫ్రెండ్‌ గురించి మాట్లాడుతూ..''ముంబైలో అతడు పెద్ద ఈవెంట్‌ మేనేజర్‌. సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌ టైమ్‌లో పరిచయమైంది. అప్పట్నుంచి మేం స్నేహితులు అయ్యాం. కానీ ఆ తర్వాత తెలిసింది ఒకరినొకరం ఇష్టపడుతున్నామని. ముందుగా నేనే 'ఐ లైక్‌ యు' అంటూ మెసేజ్‌ పెట్టాను. కొన్నాళ్లకు అట్నుంచి కూడా గ్రీన్‌సిగ్నల్‌ వచ్చేసింది'' అంటూ ఎంతో ఆనందంగా చెప్పింది. మొత్తానికి ఇన్నాళ్ళూ రూమర్స్‌గా ఉన్న ఆమె లవ్‌ లైఫ్‌ ఇప్పుడు పటాపంచల్‌ అయిపోయింది. తెలిసిపోయింది.
Tags:    

Similar News