క్వాంటికో కు ఎండ్ కార్డ్ పడినట్టే

Update: 2018-05-12 13:34 GMT
బాలీవుడ్ బ్యూటీ.. మాజీ మిస్ వరల్డ్ ప్రియాంక చోప్రా గతేడాది బేవాచ్ సినిమాతో హాలీవుడ్ లో అడుగు పెట్టింది. రాక్ గా పాపులర్ అయిన డ్వేన్ జాన్సన్ హీరోగా నటించిన ఆ మూవీ కాస్తో కూస్తో ఆడిందంటే అది ప్రియాంకకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ వల్లే. అమెరికాలో ప్రియాంకకు ఆ రేంజ్ పాపులారిటీ రావడానికి కారణం కెనడియన్ టీవీ షో క్వాంటికో.

క్వాంటికో క్రైం సిరీస్ ఇప్పటికి రెండు సీజన్లు పూర్తయ్యాయి. ఈ రెండింటికీ ప్రేక్షకుల నుంచి విపరీతమైన ఆదరణ లభించింది. ఈ షోలు తెగ క్లిక్కయ్యాయి. దీంతో ఈ సిరీస్ ను తీస్తున్న ఏబీసీ స్టూడియోస్ థర్డ్ సీజన్ స్టార్ట్ చేసింది. రెండేళ్ల క్రితం సీజన్ 2లో స్టోరీ ఎక్కడ ఆగిందో తిరిగి అక్కడి నుంచే స్టార్ట్ చేశారు. అయితే క్వాంటికో సిరీస్ అక్కడి జనాలకు బోర్ కొట్టేసిందో ఏమో.. ఈ సీజన్ కు అస్సలు రేటింగులు లేకుండా పోయాయి. ప్రేక్షకుల ఆదరణ తగ్గిపోయిందని తేలిపోవడంతో ఈ సిరీస్ ను ఇంతటితో ముగించడమే మంచిదని ఏబీసీ స్టూడియో డిసైడ్ అయిందంట.

ఏప్రిల్ 26 నుంచి క్వాంటికో మూడో సీజన్ స్టార్ట్ చేశారు. ఈ షో అనుకున్నంతగా క్లిక్ కాకపోవడంతో ప్రస్తుతం ప్రైమ్ టైమ్ లో టెలికాస్ట్ చేయకుండా వేరే ప్రోగ్రాం ప్రారంభించారు. ఈ సీజన్ లో 13 ఎపిసోడ్స్ ప్లాన్ చేశారు. 13వ ఎపిసోడ్ అయిపోగానే ఈ షోకు శుభం కార్డు పడిపోనుంది. అంటే ఇంక ప్రియాంక బ్యాగు సర్దుకుని బాలీవుడ్ కు వచ్చేయొచ్చు.
Tags:    

Similar News