ఫుల్లుగా హాలీవుడ్ నటిగా మారింది

Update: 2016-10-02 17:30 GMT
హాలీవుడ్ కి బాలీవుడ్ కి ప్రధానంగా తేడా ఏంటి? మేకింగ్ లో అయితే చాలానే అంతరాలు ఉంటాయ్ కానీ.. హీరోయిన్స్ విషయానికొస్తే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఎక్స్ పోజింగ్ లెవెల్స్ గురించే. అక్కడ న్యూడ్ గా నటించడమే కాదు.. బెడ్ రూమ్ సన్నివేశాలను కూడా పర్ఫెక్ట్ గా పండించేయగలుగుతారు హీరోయిన్లు.

మనోళ్లు ఎవరైనా హాలీవుడ్ లో అడుగుపెట్టినా ఫెయిల్ అయ్యేది ఇక్కడే. కానీ ప్రియాంక చోప్రా ఈ అడ్డుగోడను చెరిపేస్తోంది. ఇప్పటికే ఇండియన్స్ చూపించిన దానికి మించి.. అక్కడి జనాలకు అందాలను ప్రదర్శన పెట్టేసింది. క్వాంటికో టీవీ సిరీస్ ఫస్ట్ పార్ట్ కంటే.. ఇప్పుడు ప్రారంభమైన రెండో భాగంలో.. డోస్ మరింతగా పెంచేసింది పీసీ. ఈ వారం టెలికాస్ట్ కానున్న ఎపిసోడ్ కి  సంబంధించి.. రిలీజ్ చేసిన ప్రోమో చూస్తే.. ఓ ఇండియన్ హీరోయిన్ ఈ రేంజ్ లో రెచ్చిపోయిందా అనిపించక మానదు. లిప్ టు లిప్ ముద్దులు పెట్టేసుకోవడం.. కౌగిలితంలో మైమరచిపోవడం.. తన్మయత్వంతో ఎంజాయ్ చేయడం.. ఇలా చెప్పాలంటే.. ఒక నిమిషం ప్రోమోలో ప్రియాంక చూపించని సంగతులు ఏమీ లేవనే చెప్పాలి.

జస్ట్ న్యూడ్ లుక్ ఒకటి మినహాయిస్తే.. దాదాపు హాలీవుడ్ హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గకుండా రెచ్చిపోయింది ప్రియాంక.

Full View
Tags:    

Similar News