ఆర్నెల్ల తరువాత.. హాలీవుడ్‌ హీరోయినే

Update: 2015-07-23 20:12 GMT
బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ప్రియాంక చోప్రా ఇమేజ్‌ అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఈ అమ్మడు ఓ వైపు బాలీవుడ్‌ లో నటిస్తూనే హాలీవుడ్‌ ప్రయత్నాలు ప్రారంభించింది. అందులో భాగంగానే అమెరికాకి చెందిన ప్రముఖ టెలీ షో 'క్వాంటికో'లో నటించింది. ఇదో ఫేమస్‌ టెలీ సీరియల్‌. ఇప్పటికే ఆర్నెళ్ల పాటు అమెరికాలో ఉండి షూటింగులో పాల్గొని వచ్చింది. ఈ సీజన్‌ త్వరలోనే టెలీకాస్ట్‌ కానుంది. సెప్టెంబర్‌ నుండి హాలీవుడ్‌ టివిల్లో అమ్మడిని మనం చూసేయవచ్చు.

ఇంతలోనే అమ్మడు సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలోని బాజీరావు మస్తానీ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని, తిరిగి క్వాంటికో సీజన్‌ 2 చిత్రీకరణకు సిద్ధమవుతుందని తెలుస్తోంది. ఈ సీజన్‌ రేటింగుల్ని బట్టి ఈ చిత్రీకరణ ఉంటుంది. మరో 13 ఎపిసోడ్స్‌ చిత్రీకరించడానికి రెడీ అవుతున్నారని ప్రియాంక చెబుతోంది. అదే జరిగితే మరో ఆర్నెళ్లు ముంబై లో కనిపించడం కుదరదని చెప్పేసింది. అమెరికన్‌ డాలర్ల వ్యామోహంలో పడ్డాక.. ఇక ఇండియన్‌ రూపీలు ఎక్కడ కనిపిస్తాయని జోకులు వేస్తున్నారు కో-స్టార్స్‌.

అయితే అందరూ అనుకున్నట్లే ఒకవేళ ప్రియాంక చోప్రా హాలీవుడ్‌ లో కూడా పెద్ద స్టార్‌ అయిపోతే మాత్రం.. ఇక ఆమెకు తిరుగుండదు. ఎందుకంటే అక్కడ పెళ్ళయ్యిందా, పిల్లలున్నారా, బోయ్‌ ఫ్రెండ్‌ ఎవరు అనే అంశాలను పట్టించుకోకుండా సినిమాల్లో హీరోయిన్‌ గా అవకాశం ఇస్తారు. ఒకవేళ ఈమె హాలీవుడ్‌ హీరోయిన్‌ అయిపోతే అది మనకూ గర్వకారణమే.
Tags:    

Similar News