ప్రియాంక హాలీవుడ్ సీరియల్ ఆపేస్తున్నారా?

Update: 2017-02-09 08:16 GMT
అమెరికన్ టెలివిజన్ సిరీస్ క్వాంటికోలో అవకాశం రావడంతో.. బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హాలీవుడ్ కి మకాం మార్చేసిన సంగతి తెలిసిందే. దాదాపు అక్కడే సెటిల్ అయిపోయిన పీసీ.. క్వాంటికో సిరీస్ ను బేస్ చేసుకుని.. హాలీవుడ్ మూవీ బేవాచ్ లో కూడా చోటు సంపాదించేసింది.

ప్రస్తుతం క్వాంటికో సిరీస్ 3 టెలికాస్ట్ అవుతోంది. ఆదివారాలు ప్రసారం అయ్యే క్వాంటికోకు.. రేటింగ్స్ చాలా తక్కువగా వస్తున్నాయట. కేవలం 0.76 రేటింగ్ మాత్రమే రావడంతో.. క్వాంటికో3ను సోమవారాలకు మార్చారు. ఇది కూడా పెద్దగా వర్కవుట్ అవలేదని తెలుస్తోంది. రెండు సోమవారాల యావరేజ్ రేటింగ్ కేవలం 0.75 మాత్రమే వచ్చిందని అక్కడి టీవీ రేటింగ్స్ ను ట్రాక్ చేసే ఓ సంస్థ చెప్పింది. ఇదే  సమయంలో ప్రసారం అయ్యే బాచిలర్ అనే సిరీస్ తో పోల్చేతే..  మూడో వంతు రేటింగ్ మాత్రమే క్వాంటికో దక్కించుకోగలిగింది.

దీంతో ఇప్పుడు క్వాంటికోను త్వరలో రద్దయ్యే సిరీస్ ల జాబితాలో చేర్చేశారు. క్వాంటికో మొదటి సిరీస్ కంటే రెండో సిరీస్ కు రేటింగ్ తక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మూడో సిరీస్ పరిస్థితి మరీ దారుణంగా ఉండడంతో.. ఇక క్వాంటికోకు ముగింపు పలికే అవకాశాలున్నాయని అంటున్నారు. మరిప్పుడు ప్రియాంక చోప్రా ఏం చేస్తుందో!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News