ఫోటో స్టోరి: ఎరుపులో మెరుపులు

Update: 2016-11-02 13:30 GMT
క్వాంటికో సీరియల్ తో హాలీవుడ్ లో పేరుతోపాటు గుర్తింపు కూడా సంపాదించేసిన ప్రియాంక చోప్రా.. ఇప్పుడు బాగా స్పీడ్. ఈమె వేగాన్ని అందుకోవడం ఎవరికీ సాధ్యం కావడం లేదు. హాలీవుడ్ హీరోయిన్స్ తో పోల్చేయలేం కానీ.. వరుసగా అన్ని ఇంటర్నేషనల్ మేగజైన్స్ కు ఫోటో షూట్స్ చేస్తూ.. కవర్ పేజ్ లు ఎక్కేస్తూ.. వాళ్లకు తను టఫ్ కాంపిటీషన్ అనిపించేసుకుంటోంది.

తాజాగా హెలో మేగజైన్ నవంబర్ ఎడిషన్ కవర్ పేజ్ పై కనిపించిన పీసీ.. రెడ్ కలర్ ఔట్ ఫిట్స్ తో కళ్లు జిగేల్ మనిపించేసింది. సహజంగా ఎరుపుతో ఇంత మెరుపులు చూపించడం అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు కానీ.. అమ్మడి స్కిన్ టోన్ కి.. రెడ్ కలర్ ఔట్ ఫిట్స్ గ్రాండ్ నెస్ ని తెచ్చిపెట్టేశాయి. పైగా రాయల్ గా పీసీ ఇచ్చిన పోజ్ అయితే.. రాయల్టీకి నిలువెత్తు రూపంలా ఉందని చెప్పాలి. తాజాగా హాలీవుడ్ మూవీ బేవాచ్ ప్రమోషన్స్ కోసం.. బూవాచ్ అంటూ హాలోవీన్ లుక్ చూపించిన ప్రియాంక చోప్రా.. 24 గంటలు తిరిగేసరికి తన బ్యూటీలోని మరో యాంగిల్ ని చూపించడం విశేషం.

ఫోటో షూట్స్ లోనే కాదు.. ఇంటర్వ్యూల్లోనూ.. ఫంక్షన్స్ లో కూడా తన రేంజ్ ను అంతకంతకు పెంచుకుంటూ వెళ్తున్న ప్రియాంక.. ఇప్పట్లో నా స్పీడ్ కి బ్రేక్ వేసేవారు ఎవరూ లేరనే ధీమాని తన లుక్ లోనే చూపించేస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News