డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ మెల్లగా తన ఫ్యూచర్ సినిమాలపట్ల స్పీడ్ పెంచుతున్నట్లే అనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ డైరెక్టర్స్ లో పూరీ ఒక్కడే తక్కువ రోజుల్లో సినిమా తీయగలడు. ఈ విషయం ఇదివరకే చాలాసార్లు రుజువు చేసాడు. పూరీకి ఎక్కువకాలం ఒకే సినిమా షూటింగ్ చేయడం బోర్ అట. ఈ విషయాన్నీ ఆయనే పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చాడు. అయితే పూరీ తన సినిమాలలో డైలాగ్స్ యాక్షన్ లతో పాటు కామెడీ కూడా ప్రధానంగానే చూపిస్తాడు. ప్రస్తుతం లైగర్ అనే పాన్ ఇండియా సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. రౌడీహీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్యపాండే హీరోయిన్ గా కనిపించనుంది.
అయితే మొన్నటి వరకు టైటిల్ విషయంలో సస్పెన్స్ పెట్టిన డైరెక్టర్ ఇటీవలే లైగర్ అనే టైటిల్ రివీల్ చేసి ట్రీట్ ఇచ్చాడు. లైగర్ సినిమాలో సునీల్ శెట్టి కూడా నటిస్తున్నట్లు ప్రకటించాడు పూరీ. ఏడాది కాలంగా సాగుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. అయితే తాజా సమాచారం ప్రకారం.. లైగర్ సినిమా స్టోరీ తండ్రికొడుకు చుట్టూ తిరుగుతుందని సినీవర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా.. లైగర్ సినిమా లైన్ లో ఉండగానే పూరీ తదుపరి సినిమాను ఓకే చేసినట్లు టాక్. కన్నడ హీరో ధృవ్ సార్జాతో పూరీ తదుపరి సినిమా ప్లాన్ చేసాడట. ఇప్పటికే ధృవకు స్టోరీ లైన్ వినిపించడం జరిగిందని.. వెంటనే స్టోరీ లైన్ నచ్చి ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. అలాగే వీరి కాంబినేషన్ మూవీ ఏకకాలంలో తెలుగు, కన్నడ భాషల్లో రూపొందనుందని తాజా కథనాలు చెబుతున్నాయి. చూడాలి మరి పూరీ నుండి అధికారిక ప్రకటన రానుందేమో!