ఆకాశ్ పూరి - కేతిక శర్మ జంటగా అనిల్ పాదూరి 'రొమాంటిక్' సినిమాను రూపొందించాడు. రమ్యకృష్ణ కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమాకి పూరి - చార్మీ నిర్మాతలుగా ఉన్నారు. కథ .. మాటలు .. స్క్రీన్ ప్లే పూరి అందించడం మరింత ఆసక్తిని పెంచే అంశంగా మారింది. సునీల్ కాశ్యప్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను, ఈ నెల 29వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిన్న రాత్రి వరంగల్ - రంగీలా మైదాన్ లో నిర్వహించారు. ఈ వేడుకకు విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా వచ్చాడు.
ఈ వేదికపై పూరి జగన్నాథ్ మాట్లాడుతూ .. " వరంగల్ గురించి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. పదేళ్ల వయసులో నేను స్కూల్ తరఫున ఇక్కడికి వచ్చాను. అప్పుడు మా స్కూల్ మాస్టర్ వరంగల్ చరిత్ర చెప్పారు. కాకతీయ సామ్రాజ్యం గొప్పతనం గురించి చెప్పారు. ఒక స్త్రీ మొట్టమొదటిసారి పరిపాలించిన ప్రాంతం ఇది. రుద్రమదేవి .. ఆమె ఆనవాళ్లు ఇక్కడ ప్రతి ఆడవాళ్లలో ఉంటాయని చెబుతూ ఉంటారు. ఏకశిలా నగరం వరంగల్ .. 'రామప్ప గుడి'ని అప్పుడే పునాదులు లేకుండా కట్టారు ఇక్కడ .. గ్రేట్ టెక్నాలజీ. చిన్నప్పుడు నేను వేయి స్థంభాల గుడికి వెళ్లి స్థంభాలు లెక్కపెడుతూ తిరిగాను.
అప్పటి నుంచి నాకు వరంగల్ తో కనెక్షన్ ఉంది. పోతన 'భాగవతం' పుట్టింది ఇక్కడే .. ది గ్రేట్ ప్రైమ్ మినిస్టర్ పుట్టిందీ ఇక్కడే. 'పుట్టుక నాది .. చావు నాది మధ్యలోదంతా దేశానిది' అని కాళోజీ అన్నది ఇక్కడి నుంచే. నాట్యం పుట్టింది ఇక్కడ .. కళలకు పుట్టినిల్లు వరంగల్. ఇక్కడివారికి కళాకారులు అంటే పిచ్చి .. సినిమాలంటే పిచ్చి. అందుకే మేము వరంగల్ వస్తాము. వరగంల్ మాకు సెంటిమెంట్ .. ఇక నుంచి మా ఫంక్షన్స్ అన్నీ వరంగల్ లోనే. ఇక 'రొమాంటిక్' సినిమాను ఫస్టు టైమ్ అనిల్ పాదూరి డైరెక్ట్ చేశాడు.
నేను ఈ సినిమాను ఓ నాలుగైదు సార్లు చూశాను .. ఎక్కడా బోర్ కొట్టదు. సెకండాఫ్ నాకు చాలా బాగా నచ్చింది. క్లైమాక్స్ అయితే నాకు ఇంకా బాగా నచ్చింది. ఆకాశ్ .. కేతిక అండ్ రమ్యకృష్ణ ఇరగ్గొట్టేశారు. మీకు మంచి లవ్ స్టోరీ కావాలంటే ఈ సినిమా చూడండి. నా కొడుకు గురించి ఎక్కువ చెబితే బాగుండదు .. వాడు ఈ రోజున ఎక్కువ మాట్లాడాడు. చిన్నప్పుడు వాడు .. నేను మార్నింగ్ లేవగానే ఏదో ఒక సినిమాలోని డైలాగ్ చెప్పి వేషం ఇవ్వమని అడిగేవాడు. ఫైనల్ గా వాడికి వేషం వచ్చింది. ఒక దర్శకుడిగా వాడి గురించి నేను ఒకటే ఒక మాట చెబుతాను .. హీ ఈజ్ ఏ వెరీగుడ్ యాక్టర్.
కేతిక పెద్ద అందగత్తె కాదు గానీ .. పాటలు అవీ చాలా బాగా పాడుతుంది. ఇక రమ్యకృష్ణగారు ఈ సినిమా చేయడం మా అదృష్టం. ఆమె చేయడం వలన ఈ సినిమా జాతకమే మారిపోయింది. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరికీ థాంక్స్ చెబుతున్నాను. ఈ సినిమా ట్రైలర్ ను డాళింగ్ ప్రభాస్ రిలీజ్ చేశాడు. డాళింగ్ కి నేను థ్యాంక్స్ చెబుతున్నాను. ఇక విజయ్ తో నేను 'లైగర్' చేస్తున్నాను. ఆయన యాక్టింగ్ చూస్తే నాకే షాకింగ్ గా ఉంది. 'లైగర్' ఎప్పుడు వస్తుందా అని మీరే కాదు నేను కూడా వెయిట్ చేస్తున్నాను" అని చెప్పుకొచ్చారు.