స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరోగా ఎదగాలనే పట్టుదలతో ఉన్నాడు. అందుకే బాలనటుడి స్థాయిని దాటుకుని, నూనూగు మీసాల హీరోగా తొలి ఎటెంప్ట్ చేశాడు. ఆంధ్రా పోరి అతడి మొదటి సినిమా. ఇదో రీమేక్ చిత్రం. ఒరిజినల్ లో హిట్ కొట్టినా ఇక్కడ ఫ్లాపైంది. బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. దాంతో ఈ కుర్ర హీరో రేసులో వెనకబడ్డాడు. ఒకవేళ ఆంధ్రా పోరి హిట్ కొట్టి ఉంటే ఆకాష్ కెరీర్ ఈపాటికే వెలిగిపోయేదే. నాలుగైదు అవకాశాలు వెంటపడి ఉండేవే. అయితే ఈ ఒక్క ప్లాపు ఆకాష్ కెరీర్ ని కానీ, జీవితాన్ని కానీ శాసిస్తుంది అనుకోవడం కరెక్ట్ కాదు. అతడు పూరి అనే మర్రి చెట్టు నీడలో ఉన్నాడు. జడలు జడలుగా ఊడలు విచ్చిన మర్రి చెట్టు పూరి. ఏ కొమ్మను ఎటు విస్తరించాలో తెలిసిన మర్రిచెట్టు అతడు. కాబట్టి ఆకాష్ కి ఢోకా లేనేలేదు.
ఆకాష్ వెంట టాలీవుడ్ ని శాసించే కమర్షియల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఉన్నాడు. ఆకాష్ ని ఎట్టి పరిస్థితిలో స్టార్ హీరోని చేయడమే అతడి లక్ష్యం. అందుకు తగ్గట్టే ఆకాష్ ని నటుడిగా తయారు చేసే పనిలో ఉన్నారిప్పుడు. ఇప్పటికే డ్యాన్సులు - ఫైట్స్ వంటి స్కిల్స్ లో పక్కాగా శిక్షణ పొందుతున్నాడు. గురువుల వద్ద తర్ఫీదు అందుతోంది. ఈ విషయంలో ఆకాష్ కి ఎలానూ తండ్రి సలహాలు - సూచనలు ఉండనే ఉంటాయి. ఆంధ్రా పోరి లాంటి సినిమాలు ఆకాష్ కి ఓ విజిటింగ్ కార్డ్ లాంటివే. ఉపయోగపడితే క్రెడిట్ కార్డులా వాడేస్తారు. ఉపయోగపడకపోయినా వచ్చిన నష్టమేమీ లేదు. ప్రస్తుతం ఆకాష్ అకడమిక్ స్టడీస్ కొనసాగిస్తూనే , ఇలా సినిమాల్లో ఎటెంప్ట్ చేస్తున్నాడు. ఇంకాస్త ఏజ్ ముదిరితే .. ఆకాష్ అసలు సిసలు ఎంట్రీ ఉంటుందన్నమాట!