ప్రపంచ బ్యాడ్మింటన్లో తిరుగులేని శక్తి అయిన చైనాకు మన దేశం కూడా సరితూగగలదని సైనా నెహ్వాల్ నిరూపిస్తూ.. చైనాను మించిపోయే శక్తి మనకుందని చాటిచెప్పింది సింధు. రెండు మూడేళ్లుగా అద్భుతమైన ఆటతీరుతో ప్రపంచ స్థాయి క్రీడాకారిణిగా ఎదిగిన సింధు ముందు ఇప్పుడు చైనీయులు కూడా నిలవలేకపోతున్నారు. గత ఏడాది రియో ఒలింపిక్స్ లో రజతం గెలవడం గాలివాటం కాదని రుజువు చేస్తూ.. ఈ ఏడాది ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లోనూ అదరగొట్టి రజతం కైవసం చేసుకుని కోట్ల మందికి స్ఫూర్తిగా నిలిచింది సింధు. అందుకే సింధు విజయ గాథను సినిమాగా తీయడానికి రెడీ అవుతున్నాడు బాలీవుడ్ నటుడు సోనూ సూద్.
సోనూ నిర్మాతగా సింధు బయోపిక్ ను ఇప్పటికే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. కొంత కాలంగా తన టీంతో కలిసి సింధు జీవిత విశేషాలు తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నాడు సోనూ. ఈ క్రమంలోనే సింధు బ్యాడ్మింటన్ సాధన చేసే చోటికి వచ్చిన సోనూ.. రాకెట్ పట్టుకుని ఆమెతో షటిల్ ఆడాడు కూడా. ఇద్దరి మధ్య గేమ్ కొంచెం పోటాపోటీగానే సాగింది. దీనికి సంబంధించిన వీడియోను సోనూ తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేశాడు. మన ప్రత్యర్థి ప్రపంచంలోనే అత్యుత్తమ క్రీడాకారిణి అయినప్పుడు మనకు ఓడిపోతామన్న భయమే ఉండదు అంటూ దీనికి వ్యాఖ్య కూడా జోడించాడు. ఈ వీడియో ప్రస్తుతం క్రీడాభిమానుల్ని ఆకట్టుకుంటోంది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది.