పొట్లూరి వర ప్రసాద్.. స్వతహాగా ఆంట్రప్రెన్యూర్ అయిన ఈయన.. సినీ రంగంపై ఉన్న ప్యాషన్ తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. అతి తక్కువ సమయంలోనే బడా చిత్రాల నిర్మాతగా మారిపోయాడు. ప్రారంభం నుంచి ఈయనకు కాలం పెద్దగా కలిసి రాలేదు. పీవీపీ బ్యానర్ పై తీసిన సినిమాలు వరుసగా షాక్ లు ఇస్తూనే ఉన్నాయి.
తెలుగులో వీడింతే పేరుతో డబ్ అయిన తమిళ్ మూవీ రాజా పట్టాయ్ చిత్రంతో 2011లో సినీ రంగ ప్రవేశం చేసిన పీవీపీ.. అక్కడి నుంచి వరుసగా ఎదురుదెబ్బలు తింటూనే ఉన్నారు. ప్రధానంగా అనుష్క-ఆర్యలతో చేసిన వర్ణ మొదటి భారీ షాక్ కాగా.. ఆ తర్వాత కూడా స్వీటీ చేసిన సైజ్ పేలిపోయింది. ఆ మధ్యలో విడుదలైన బలుపు మాత్రం సక్సెస్ అనిపించుకుని.. స్వల్ప లాభాలను ఇవ్వగలిగింది. ఇక నాగ్-కార్తీలతో చేసిన ఊపిరి చిత్రం అందరి ప్రశంసలు అందుకున్నా కమర్షియల్ ఫెయిల్యూర్ గా నిలిచింది. ఊపిరి మూవీ మొత్తంగా నిర్మాతకు 20 కోట్లు నష్టాలను మిగిల్చిందని అంచనా. ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన క్షణం మూవీ భారీ సక్సెస్ సాధించినా.. అది లో బడ్జెట్ మూవీ కావడంతో.. సక్సెస్ తర్వాత వచ్చిన లాభాలు.. ఈ నష్టాలతో పోల్చితే చాలా తక్కువ.
ఇక మహేష్ బాబుతో చేసిన బ్రహ్మోత్సవం ద్వారా.. అన్ని నష్టాలను కవర్ చేసుకోగలుతాడని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేశాయి. అశ్చర్యకరంగా.. ఈ మూవీ అన్నింటికంటే పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. ఇప్పుడు బయ్యర్లకు ఎదురు డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి తలెత్తింది. మొత్తంగా అన్ని సినిమాల నష్టాలతో కలిపి ఇప్పటికి ఓ 100 కోట్లు ఆవిరైపోయాయని తెలుస్తోంది. పీవీపీ లాంటి వ్యక్తికి ఇది పెద్ద మొత్తం కాకపోయినా.. ఇండస్ట్రీలో నష్టాలంటే అది పెద్ద బ్యాడ్ సెంటిమెంట్. అదే అసలు ప్రాబ్లెం.