టాలీవుడ్ లో నిన్న మొన్నటివరకూ వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న రాశీఖన్నాకు ఇప్పటికిప్పుడు ఒక్కటంటే ఒక్క ఆఫరూ లేదు. గత ఏడాది డిసెంబర్ లో `ప్రతిరోజు పండగే` సినిమాతో సాలీడ్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంది. ఏంజిల్ ఆర్నాగా టిక్ టాక్ వీడియోలతో కామెడీ చేసి ఆకట్టుకుంది. అయినా మన హీరోలు రాశిఖన్నా వైపు ఆఫర్ వెతుక్కుంటూ రాలేదు.
ఆ క్రమంలోనే రాశిఖన్నా తన టోటల్ ఫోకస్ ని కోలీవుడ్ కు షిఫ్ట్ చేసేసింది. టాలీవుడ్ లైట్ తీసుకుంటేనేం తనకు కోలీవుడ్ వుందన్న ధీమాతో అక్కడికి మకాం మార్చేసింది. ఎన్ని ఫొటోషూట్ లు చేసినా ఒక్క రంటే ఒక్క హీరో కూడా రాశీ వంక చూడలేదు. ఆమెకి ఆఫర్ ఇవ్వాలనుకోలేదు. అయితేనేం తమిళంలో వద్దంటే రాశి వెంటపడుతున్నారు అక్కడి నిర్మాతలు.
ప్రస్తుతం తమిళంలో రాశీ చేతిలో మొత్తం నాలుగు చిత్రాలున్నాయి. సుందర్ సి `అరణ్మై3`.. విజయ్ సేతుపతితో `తుగ్లక్ దర్బార్`,... సిద్ధార్ధ్ తో `సైతాన్ కా బచ్చా` చిత్రాలతో పాటు `మేధావి` చిత్రాల్లో నటిస్తోంది. మరి కొన్ని చిత్రాలు చర్చల దశలో వున్నాయట. దీంతో టాలీవుడ్ ని రాశీ లైట్ తీసుకున్నట్టేనా? అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే కోలీవుడ్ ఆఫర్స్ ని కాదనలేక ఇక్కడ తగ్గించుకుందన్న వాదనా అభిమానుల్లో వినిపిస్తోంది. రొటీనిటీకి భిన్నంగా కొత్తదనం ఉన్న స్క్రిప్టుల్ని ఎంచుకునేందుకు రాశీ తపిస్తోందట.