ఫోటో స్టొరీ: స్లిమ్ముగా మారిన చబ్బీ స్వీట్ హార్ట్!

Update: 2019-07-05 01:30 GMT
టాలీవుడ్ లో ఉన్న గ్లామరస్ బ్యూటీల లిస్టులో రాశి ఖన్నా పేరు మొదటి వరసలోనే ఉంటుంది.  రాశి తన కెరీర్ ఆరంభంలో చేసినవన్నీ గ్లామర్ పాత్రలే.  వరుణ్ తేజ్ హీరోగా 'తొలిప్రేమ' తోనే మొదటి సారి రాశికి మంచి పెర్ఫార్మర్ అనే ట్యాగ్ వచ్చింది.  అయితే మంచి నటిగా పేరు వచ్చిందని తనకు అచ్చొచ్చిన గ్లామర్ ను వదిలేసే రకం కాదు రాశి.  పైగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే భామ కదా అందుకే గ్లామర్ ఫోటో షూట్లు అసలే మానదు.

తన ట్రెండ్ ను కంటిన్యూ చేస్తూ రాశి తాజాగా తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది.  ఈ ఫోటోకు రాశి ఇచ్చిన క్యాప్షన్ "విటమిన్ సీ(sea) #షూట్ డైరీస్ #వెంకీ మామ".  జనాలకు ఎ బీ సి విటమిన్ లు తెలుసు కానీ ఇలాంటి సీ విటమిన్ తెలియదు.  మొదటిసారి ఇలా సముద్రం విటమిన్ ను అందరికీ పరిచయం చేసింది. ఫోటోలో  ఒక అందమైన బీచ్ లొకేషన్ లో రాళ్ళపై  నిలబడి తన జుట్టును సవరించుకుంటూ ఏదో ఆలోచనలో ఉన్నట్టుగా తల వంచింది.  రెడ్ కలర్ డిజైన్ ఉండే షర్టు.. స్కర్ట్ ధరించి ఒక సూపర్ పోజిచ్చింది.  రాశి మామూలుగానే సన్నగా ఉంటుంది. కానీ ఈ ఫోటోలో మరింత స్లిమ్ముగా కనిపిస్తోంది. జీరో సైజ్ కోసం ఏమైనా ప్రయత్నాలు చేస్తోందేమో మరి.

ఈ ఫోటోకు నెటిజన్లు ఇంట్రెస్టింగ్ కామెంట్లు పెట్టారు. "నా చబ్బీ స్వీట్ హార్ట్ స్లిమ్ అయింది".. "స్వీట్ స్వీట్ స్వీటీ".. "అది విటమిన్ షీ".."సీ వ్యూ.. షీ  వ్యూ సూపర్" అంటూ కామెంట్లు పెట్టారు.  ఇక రాశి ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే 'వెంకీ మామ' తో పాటుగా తమిళంలో 'షైతాన్ కా బచ్చా'.. 'కడైసి వ్యవసాయి'.. 'సంగ తమిళన్' అనే సినిమాల్లో నటిస్తోంది.


Tags:    

Similar News