`ఇండియన్ -2` సెట్స్ లో జరిగిన క్రేన్ ప్రమాదం దేశ వ్యాప్తంగా ఎంత సంచలనమైందో తెలిసిందే. ఈ ఘటనలో ముగ్గురు చనిపోగా..10 మంది తీవ్రగాయాల బారినపడ్డారు. కమల్ హాసన్- శంకర్- కాజల్ అగర్వాల్ తృటిలో తప్పించుకున్నారు. చనిపోయిన ముగ్గురుకి యావత్ పరిశ్రమ నివాళులు అర్పించింది. కమల్ హాసన్ తన భావోద్వేగపు వ్యాఖ్యలతో నివాళిని అర్పించారు. ఆ కుటుంబాలను ఆదుకునేందుకు కోటి రూపాయాల విరాళం ప్రకటించారు. ఇక చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ రెండు కోట్ల రూపాయాలు ఆర్ధిక సాయం చేసింది. అయితే ఇప్పటి వరకూ శంకర్ ఈ ఘటన పై నోరు విప్పలేదు.
బాధిత కుటుంబాలను పరావమర్శించిందే లేదు. కనీసం చనిపోయిన ముగ్గురి భౌతిక కాయాలకు శ్రద్ధాంజలి ఘటించినట్లు కూడా వార్తలు రాలేదు. ఘటన జరిగిన నాటి నుంచి శంకర్ స్తబ్ధుగానే ఉన్నారు. తాజాగా చిత్ర యూనిట్ తగు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లనే ఈ ఘటన చోటు చేసుకుందని తమిళనాడులో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోట్లాది రూపాయాలు ఖర్చు చేసి షూటింగ్ చేస్తారు. మనుషులు ప్రాణాలకు ఆ మాత్రం రక్షణ కల్పించలేరా? అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తాజాగా డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ చెన్నయ్ లో సంతాప సభను ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా యూనియన్ అధ్యక్షడు రాధారవి శంకర్ పై నిప్పులు చెరిగారు. దర్శకులు హాలీవుడ్ స్థాయిలో సినిమాలు చేయాలనుకుంటారు. కానీ నటులు..సిబ్బంది భద్రతను మాత్రం పట్టించుకోరు. ఐడియాలు ఆ స్థాయిలో ఉన్నందుకు సంతోషం. కానీ చిన్న చిన్న జీవితాలు రోడ్డున పడితే వాళ్ల పరిస్థితి ఏంటనేది కూడా ఆలోచించాలని శంకర్ ని ఉద్దేశించి ఎద్దేవా చేసారు. ఇటీవల రాధారవి..గాయని చిన్మయి శ్రీపాద మధ్య కోల్డ్ వార్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. తాజా వ్యాఖ్యలతో రాధరవి మరోసారి కోలీవుడ్ మీడియా లో హాట్ టాపిక్ అయ్యారు.