రాధేశ్యామ్ ఇక ప్ర‌మోష‌న్స్ జెట్ స్పీడ్

Update: 2021-12-03 09:30 GMT
సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. మ‌రోవైపు ప్ర‌చారం ప‌నుల్లో వేగం పెంచ‌నున్నారు. ఇప్ప‌టికే టీజ‌ర్ రిలీజ్ అయింది. లిరిక‌ల్ సాంగ్స్ ని ఒక్కొక్క‌టిగా రిలీజ్ చేస్తున్నారు. `ఆషీకి ఆగయి` అంటూ సాగే హిందీ వెర్ష‌న్ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

తాజాగా ఆ పాట‌కి తెలుగు వెర్ష‌న్ కూడా రిలీజ్ అయింది. `నుగుమోయి తార‌లే` అంటూ సాగే ఈ పాట‌ని సిధ్ శ్రీరామ్ ఆల‌పించారు. జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. సోష‌ల్ మీడియాలో ఈ పాట వైర‌ల్ గా మారింది. శ్రోత‌ల నుంచి మంచి స్పంద‌న వ‌స్తోంది.

పాట‌లో ప్ర‌భాస్ -పూజా హెగ్దే ఎంతో రొమాంటిక్ గా న‌టించారు. అంద‌మైన లోకేష‌న్స్ లో పాట‌ను అంతే అందంగా చిత్రీక‌రించారు. పాట మాత్రం విదేశీ లొకేష‌న్స్ లోనే షూట్ చేసారు. స‌ముద్ర తీరంలో షూట్ చేసిన స‌న్నివేశాలు చాలా రిచ్ గా క‌నిపిస్తున్నాయి. బైక్ పై లాంగ్ డ్రైవ్ స‌న్నివేశాలు అంతే హైలైట్ గా ఉన్నాయి.

కెమెరా ప‌నిత‌నం పాట‌ని మ‌రో లెవ‌ల్ కి తీసుకెళ్లింది. నిర్మాణంలో ఎక్క‌డా రాజీ క‌నిపించ‌లేదు. సినిమా కోసం పెట్టిన ప్ర‌తీ రూపాయి ఒక్క పాట‌లోనే క‌నిపిస్తుంది. అంటే సినిమాని యువి క్రియేష‌న్స్ ఎంత ప్ర‌తిష్టాత్మంగా నిర్మిస్తుందో అర్ధ‌మ‌వుతుంది. ఇక ఈ సినిమాకి తెలుగు...హిందీ సంగీత ద‌ర్శ‌కులు క‌లిసి ప‌నిచేస్తున్నారు.

ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలోనే ఒకేసారి ఒక సినిమాకి రెండు భాష‌ల్లో వేర్వేరు సంగీత ద‌ర్శ‌కులు ప‌నిచేయ‌డం ఇదే తొలిసారి. ఇప్ప‌టివ‌ర‌కూ రిలీజ్ అయిన రెండు పాట‌ల‌కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

మిగ‌తా పాట‌లు ఎలా ఉంటాయి అన్న‌ది చూడాలి. ఇంత‌వ‌ర‌కూ మేక‌ర్స్ ప్లాన్ చేసిన‌ట్లు మ్యూజిక‌ల్ గా బాగానే వ‌ర్కౌట్ అయింది. పీరియాడిక్ ల‌వ్ స్టోరీ కాబ‌ట్టి నేప‌థ్య సంగీతం సినిమాకు అంతే కీల‌కం కానుంది. ఈ చిత్రానికి జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.


Tags:    

Similar News