అందానికి కొత్త అర్ధం చెప్పిన అహల్య

Update: 2016-04-21 18:37 GMT

Full View


అహల్య అనే షార్ట్ ఫిలింతో హీరోయిన్ రాధికా ఆప్టే ఎంతగా పేరు సంపాదించిందో చూశాం. ఇప్పుడు మరొక మినీ ఫిలింతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'ఫైండ్ యువర్ బ్యూటిఫుల్' టైటిల్ పై తెరకెక్కిన ఈ షార్ట్ ఫిలిం నిడివి నాలుగు నిమిషాలే. అయినా సరే.. తన మార్క్ నటనతో ఆకట్టుకుంది అహల్య.

'అందం అంటే సమాజం నిర్దేశించిన కొన్ని ప్రమాణాల ప్రకారం శరీరాన్ని మలచుకోవడం అనే భావన పెరిగిపోయింది. కానీ అందం అంటే సమాజం కోరుకున్నట్లుగా ఉండడం కాదు. నీలో ఉన్న అంతర్గత సౌందర్యాన్ని, నిన్ను నువ్వు మనసారా ప్రేమించడం' అనే మెసేజ్ ఇస్తుంది ఈ షార్ట్ ఫిలిం.

కల్చర్ మెషీన్ అనే సంస్థ యూట్యూబ్ ఛానల్ కోసం ఈ వీడియో కోసం రాధికా ఆప్టేను అప్రోచ్ అయినపుడు.. పర్సనల్ గా కూడా చాలా ఫీలయిందట ఈ హీరోయిన్. తన టీనేజ్ లో ఉన్నపుడు అందంగా కనిపించేందుకు ఎన్ని తిప్పలు పడిందో గుర్తుకు వచ్చిందని అంటోంది. తను చేసిన ఆ రోల్ ను చాలా పర్సనల్ గా తీసుకోవడంతోనే.. ఈ మినీ షార్ట్ ఫిలిం అంత అద్భుతంగా వచ్చిందని చెప్పింది రాధికా ఆప్టే.
Tags:    

Similar News